విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: మండలంలోని సోమేశ్వరం, మాచవరం గ్రామంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి మెజిస్ట్రేట్ శ్రీ చైతన్య పాల్గొని మాట్లాడుతూ ప్రజలంతా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పేదలకు న్యాయ సహాయం ఈ విధంగా అవగాహన కల్పించారు. ప్రామిసరీ నోట్లు దిశ యాప్ మోటార్ వెహికల్ చట్టాలు మైనర్ యాక్ట్ దిశ యాప్ కౌంటర్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి రవి శంకర్ రెడ్డి, పి రామకృష్ణ ఎస్ఐ పి.వి.ఎస్ ఎస్ ఎన్ సురేష్ , న్యాయవాదులు సర్పంచ్ లు , గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.