విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి.గన్నవరం…(విశ్వంవాయిస్ న్యూస్) మండలం లోని లంకల గన్నవరం గ్రామంలో పచ్చని కోనసీమ కొబ్బరి చెట్ల నడుమ వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. గత కొన్ని రోజులుగా గ్రామస్తులు వంతుల వారీగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన అమ్మవారి తీర్థ మహోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా గ్రామంలో భక్తులు వారి ఇళ్ల వద్ద నుండి అమ్మవారి ఉత్సవ గరగలను ఊరేగిస్తూ ఆలయానికి తీసుకువచ్చి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గనిసెట్టి రామ గణపతిరావు పర్యవేక్షణలో భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తీర్థ మహోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ గణపతిరావు, సభ్యులు, వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా అమ్మవారి ఆలయ సన్నిధిలో గ్రామస్తుల ఆర్థిక సహాయంతో భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నసమారాధన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పసలపూడి రామకృష్ణ, ఎంపీటీసీ గనీసెట్టి నాగలక్ష్మి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గనిసెట్టి గంగా భవాని ఈశ్వర్ పర్యవేక్షణలో గ్రామ యువత, గ్రామ ప్రజలు విజయవంతంగా నిర్వహించారు.