Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అంబాజిపేటలో ఘనంగా మేడే దినోత్సవం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజిపేట:

 

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్)

మండలంలో మేడే దినోత్సవం సందర్భంగా ఆదివారం గ్రామాలన్నీ ఎర్ర జెండాలతో ఎరుపెక్కాయి. అంబాజీపేట సెంటర్లో సీపీఐ పార్టీ కోనసీమ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శి పితాని ఆనందరావు సీపీఐ జెండాను ఆవిష్కరించారు. తరువాత స్వర్గీయ నేలపూడి సూరన్న స్వగృహం వద్ద సీపీఐ జెండాను ఆవిష్కరించారు. పితాని ఆనందరావు స్వగృహం వద్ద కూడా సిపిఐ జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, సి.ఐ.టీ.యు, ఏ.ఐ.టి.యు.సి అనుబంధ సంఘాల నాయకులు, కార్పెంటర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గోసంగి వెంకటేశ్వరరావు, పితాని వెంకటరమణ, ఎలక్ట్రికల్ సంఘం అధ్యక్షులు నాగాబత్తుల సత్యనారాయణ, ఆశా వర్కర్ల సమన్వయకర్త బి.ఎస్తేరు రాణి, ఆటో యూనియన్ సంఘాల కార్మికులు, భవన నిర్మాణ సంఘ కార్మికులు కలిసి అంబాజీపేట నాలుగు రోడ్ల కూడలిలో ఎర్ర జెండాలు చేతపూని, కార్మికుల ఐక్యతా వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. అనంతరం తాపీ పని వార్ల సంఘం అధ్యక్షుడు పితాని వెంకటేశ్వరరావు, తదితర నాయకులు మాట్లాడుతూ కార్మికుల త్యాగం నుంచి పుట్టిన దినం ‘మేడే’ అని అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున కార్మికుల త్యాగాల గురించి వివరించారు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. అది విద్య, వైద్య, రైల్వే ఏదైనా కావచ్చు. అలా అన్నీ ప్రైవేట్‌ కిందికి వెళ్లిపోతే కార్మికులకు రాజ్యాంగంలో ఉన్న హక్కులు పడిపోతాయి. కార్మికుల హక్కులు వారికి దక్కాలంటే ఈ ప్రైవేటీకరణపై పోరాటం జరగాలి. అప్పుడే మేడే అనే పదానికి ఒక అర్థం, ఒక పరమార్ధం ఉంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమాల్లో గోసంగి సత్యనారాయణ, కోట సత్తిబాబు, చింతా రాజేంద్ర, నేలపూడి సుందరయ్య, నెల్లి కృష్ణారావు, పితాని వెంకటేశ్వరరావు, యలమంచిలి బుచ్చిబాబు, నెల్లి నాగేశ్వరావు, కత్తుల బాబులు, గుత్తుల శ్రీనివాసరావు, పితాని వెంకట రమణ
తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement