రాష్ట్ర కో ఆర్డినేటర్ ఫేక్ అన్సారీ
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
ఈద్ ఉల్ ఫిత్ర్ రంజాన్ పండుగ శుభ సందర్బంగా అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ షేక్ అన్సారీ సోమవారం మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు మరియు దాన ధర్మాలు చేసే ఈ నెలలో దేశంలోని కొన్ని బి.జె.పి పాలిత రాష్ట్రాలలో మసీదుల మీద మరియు ముస్లింలు మీద కొంత మంది మతోన్మాద శక్తులు జరిపిన దాడులను వ్యతిరేకిస్తూ పండగ రోజు ఆనందోత్సాహాలతో జరుపోకొనే ఈద్ నమాజ్ ను ఏ టైం లో ఎటువంటి దాడులు జరుగుతాయోననే అయోమయ పరిస్థితుల్లో ముస్లింలు ఉన్నారని దీనికి కారణం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఆయన అన్నారు ఈ దాడుల పై స్పందించిన పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా ఈ కుల,మత రాజకీయాలు మానుకొని దేశాభివృద్ధి కై పాటుపడాలని ఆయన కోరారు.ఈ దాడులకు పాల్పడిన మతోన్మాద శక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.