ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించిన ఆదివాసీలు.
పెద్దమట్టపల్లి పంచాయితీ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ధర్నా
రేకపల్లి ఫారెస్ట్ కార్యాలయం ఎదుట సుమారు నాలుగు గంటలపాటు బైఠాయింపు
అడవి నుండి పంట చెరకు, కంచె కట్టేందుకు సొమ్ములు చెల్లించమని డిమాండ్.
బూరుగు వాడ సెక్షన్ డి.ఆర్.ఓ, యఫ్.బి.ఓ లను
సస్పెండ్ చేయాలనీ ఆదివాసుల డిమాండ్.
చనిపోయిన వారిని కాల్చడానికి కూడా కట్టెలు
తెనివ్వడం లేదని గిరిజనుల ఆరోపణలు
పట్టా భూముల్లో ఉపాధిహామీ పనులు ద్వారా
చెరువులు తవ్వ నివ్వకుండా ఫారెస్ట్ అధికారుల అడ్డగిస్తున్నారని
ఆరోపణలు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం,:
వి.ఆర్.పురం ( విశ్వం వాయిస్ న్యూస్) 04;- అటవీశాఖ అధికారులు గిరిజనులను అడవినుండి కనీసం మనిషి చనిపోతే కాల్చడానికి కట్టెలు కూడా తీసుకురానివ్వడం లేదని పెద్దమట్టపల్లి గ్రామ పంచాయితీ లోని కొన్ని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రేఖపల్లి అటవీశాఖ కార్యాలయంలో బుధవారం కార్యాలయాన్ని ముట్టడించారు. తాము అడవిని నమ్ముకొని, అడవిని కాపాడుతున్నప్పటికి తమను అడవి నుండి ఎటువంటి ఫలసాయాన్ని తీసుకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో అలసిపోయిన గిరిజనూలు అంతా బుధవారం కార్యాలయాన్ని ముట్టడించి తిరుగుబాటు చేశారు . శుభకార్యాలకు అశుభ కార్యాలకు కట్టే పుల్లలు తేవాలంటే అటవీ శాఖ అధికారులకు కాసులు వర్షం కురిపించవల్సిందేనని కన్నీరు మున్నీరుగా గిరిజనులు ఆరోపణలు చేస్తూ మీడియా ముందుతామ ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలనుండి అడవిని నమ్ముకుని అడవి బిడ్డలు గా పేరు గాంచిన మా ఆదివాసీల పై అనేక సార్లు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చెయ్యడం సరైన విధానం కాదని ఆరోపణలు చేశారు. బ్రిటీషు కాలం నాటి నుండి లేని కొత్త విధానాలను ఇద్దరు అటవీ శాఖ అధికారులు ఇప్పుడు అమలు చేస్తూ తాము చెప్పిందే వేదం గా గిరిజనులను శాసిస్తున్నరాని ఆరోపించారు. )
* సంఘటన ఎక్కడ జరిగింది.?
అల్లూరి సీతారామరాజు జిల్లా వి.అర్.పురం మండల పరిధిలోని పెద్ద మట్టపల్లి పంచాయతీలోని ఆదివాసీలు సుమారు మూడు వందల మందికి పైగా బుధవారం మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయన్ని ముట్టడించి బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన నాయకులు మాట్లాడుతూ బూరుగు వాడ సెక్షన్ డి ఆర్ ఓ ఎఫ్ బి ఓ లు ఆదివాసులు పట్ల వేధింపులు నిలిపి వేయాలని లేనిపక్షంలో పోరాటాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు ఆదివాసి లకు అడవిలో దొరికే కట్టె పుల్లలు ను తీసుకు వెళ్ళడానికి వీలు లేదని ఫారెస్ట్ అధికారులు చెప్పడం చాలా బాధాకరం అని అడవిలో గిరిజనులు అడవికి దూరం చేస్తున్నారనలు చేశారు. ప్రజలందరి అవసరం కోసం అల్లి వాగు వద్ద ఆదివాసీలు పూజించే కట్ట మైసమ్మ తల్లి వద్ద చేతి పంపు ఏర్పాటు చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డగించి నిలిపివెయ్యడం చాలా దారుణమైన విషయం తక్షణమే అనుమతివ్వాలని కోరారు. అదేవిధంగా పట్టా భూములలో కూడా ఉపాధి హామీ పథకంలో చెరువుల పూడికలు తీస్తుంటే వాటిని కూడా రిజర్వ్ ఫారెస్ట్ లో మీ భూమి ఉందని ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. పనులు చేయకుండా అదేవిధంగా అల్లి వాగు నుండి పులుసు మామిడి గ్రామం వరకు ఉపాధి హామీ ద్వారా బిటి రోడ్డు నిర్మాణం చేపడుతుంటే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందని నిలుపుదల చేశారు తక్షణమే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
* తహసీల్దార్ శ్రీధర్, యస్ ఐ గోపాల కృష్ణ చొరవతో ధర్నా విరమించిన ఆదివాసీలు.
ఈ ధర్నా కార్యక్రమంలో జరుగుతున్న సమయంలో స్థానిక ఎమ్మార్వో శ్రీధర్, స్థానిక ఎస్సై గోపాలకృష్ణ ఆదివాసుల తో చర్చలు జరిపి ఫారెస్ట్ రేంజర్ అందుబాటులో లేక పోయేసరికి వారికి చరవాణి ద్వారా సమాచారం అందించి చి గిరిజనుల సమస్యలపై హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.గురువారం ఉదయం పది గంటలకి చర్చలకు రావాలని రేంజర్ శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి కారం లక్ష్మి స్థానిక ఎంపీటీసీ పూనెం ప్రదీప్ కుమార్ స్థానిక సర్పంచ్ వెట్టి లక్ష్మి శ్రీరామగిరి సర్పంచ్ పులి సంతోష్ మాజీ సర్పంచ్ తుర్రం బాబురావు గ్రామ పెద్దలు గుంపెన పెళ్లి వీరస్వామి తుర్రం.వెంకటనారాయణ కారం సత్తిబాబు మడకం సుబ్బారావు చిక్కాల పద్మారావు కారం గంగులు తదితరులు పాల్గొన్నారు