విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అల్లవరం:
అల్లవరం ( విశ్వం వాయిస్ న్యూస్ )
గోడి గురుకుల పాఠశాలలో విద్యాకమిటీ చైర్మన్ కోట హనుమంతరావు ఆధ్వర్యంలో గురువారం విద్ద్యార్థులకు దుప్పట్లుపంపిణీ కార్యక్రమం జరిగింది. కోనసీమజిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కోట హనుమంతరావు మాట్లాడుతూ విద్యతోనే సమాజ అభివృద్ధి, ప్రతి ఒక్కరూ చదవాలి అందరూ ఎదగాలని అన్నారు. చిన్ననాటి నుండే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు చెప్పారు.
పాముల విజయరత్నం పాముల రాజు గల్ఫ్ నుండి పంపిన దుప్పట్లను అల్లవరం మండలం గోడి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జూనియర్ కళాశాల గోడి విద్యార్థులకు పేరెంట్స్ కమిటీ చైర్మన్ కోట హనుమంతరావు చేతులు మీదుగా విద్యార్థులుకు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నల్లి సాయిబాబు వైస్ ప్రిన్సిపాల్ యు వెంకటేశ్వర రావు , విజయతేజ సాయి తేజ రవికుమార్ ,విజయలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.