విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
కార్ల్ మార్క్స్ 204వ జయంతి సందర్భంగా గురువారం సిపిఎం ఆధ్వర్యంలో స్ధానిక సుందరయ్య భవన్ ల్లో కార్ల్ మార్క్స్ చిత్ర పటానికి పూలమాలలు వేసి
ఘనంగా నివాళులు అర్పించారు.
సీపీఎం నేత కె వీరబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ మాట్లాడుతూ
మొట్టమొదటిసారిగా సోషలిజానికి ఒక శాస్త్రీయ రూపం ఇచ్చి, పెట్టుబడిదారీ విధానం స్థానంలో సోషలిజం రావడం అనివార్యమని చెప్పిన మహా మేధావి కార్ల్ మార్క్స్ అని అన్నారు. పెట్టుబడిదారీ విధానంలో ఆవిర్భవించిన కార్మికవర్గం పెట్టుబడిదారీ విధానాన్ని అంతమొందించి, సోషలిజాన్ని సాధిస్తుందని స్పష్టం చేసిన దార్శినికుడాయన అని నివాళులు
అర్పించారు. సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేష బాబ్జి మాట్లాడుతూ
మార్క్సిజాన్ని ఆయుధంగా చేసుకుని అనేక దేశాల్లో దోపిడీని కార్మిక వర్గం అంతం చేసిందని, సోషలిస్టు విప్లవాలు సాధించిందని తెలిపారు. గత శతాబ్దం చివరిలో సోషలిజానికి తగిలిన ఎదురుదెబ్బలతో మార్క్సిజం పని అయిపోయిందని, సోషలిజం కొరగానిదని పెట్టుబడిదారులు ప్రచారం అందుకున్నారని, కానీ 2008లో అమెరికాలో ప్రారంభమై, ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం పరిస్థితిని మార్చివేసిందని ఆయన అన్నారు.
సిపిఎం నాయకులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ మార్క్స్ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డాడని. ఆయనకు జెన్నీ, ఎంగెల్స్ ఎనలేని సహకారాన్ని అందించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సి అజయ్ కుమార్, జుత్తుక శ్రీనివాస్, సి రమణి, ఎంజిసూరిబాబు, వి చంద్రరావు, టి.మణికంఠ, వాసు తదితరులు పాల్గొన్నారు.