విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
అభివృద్ధి పనులను వేగవంతం
– ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు
– స్పెషల్ చీఫ్ సెక్రటరీ సమీక్ష
కాకినాడ, విశ్వం వాయిస్ః
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల ప్రగతిపై పుర పరిపాలన శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, సి డి ఎం.ఎ ప్రవీణ్ కుమార్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరం నుంచి కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, వివిధ విభాగాదిపతులు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు మాట్లాడుతూ టిడ్కో,క్లాప్, యూజర్ చార్జీలు, 15వ ఆర్థిక సంఘం నిధులు, వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, రహదారులనిర్వహణ, స్పందన తదితర అంశాలపై సమీక్ష జరిగిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి అంశాల వారీగా సంబంధిత విభాగాధిపతి లతో సమీక్షించిన ట్లు కమిషనర్ చెప్పారు. ఆయా అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా టిడ్కో ఇళ్ళు, యూజర్ చార్జీలు వసూలు, క్లాప్ పథకంలో మంజూరైన వాహనాల నిర్వహణ అంశంపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఎస్ ఈ సత్య కుమారి, డిప్యూటీ కమిషనర్ ఏసుబాబు, మేనేజర్ కర్రి సత్యనారాయణ, డి సి పి శ్రీనివాస్, ఎం హెచ్ ఓ డాక్టర్ పృద్వి చరణ్, టి పి ఆర్ ఓ కృష్ణ మోహన్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.