Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ముంపువాడగా జిల్లా కేంద్రం.. ఈగల మొతగా ఆర్థిక పరిస్థితి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– 7 ఏళ్ళకాలంలో ముగ్గురు కమిషనర్ల సాక్షిగా వేయికోట్లు వృధా!!
– స్మార్ట్ పల్లకిలో… ముంపుసిటిగా మారిన కాకినాడ
– పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దుసర్లపూడి రమణరాజు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ ,విశ్వం వాయిస్ః

నగర పాలక సంస్థ 2016లో స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ కంపెనీ గా రూపాంతరం చెందింది. మార్చి 2016 నుండి అలీం భాషా.. నవంబర్ 2018 నుండి కె రమేష్.. జనవరి2021 నుండి స్వప్నిల్ దినకర్ మున్నగు ముగ్గురు కమీషనర్లు పని చేశారు.
వీరిలో ఆలీం భాషా హయాంలో స్మార్ట్ సిటీ చట్టం వర్తింపు చేసే ప్రణాళికలో పూర్తిగా నిమగ్నం కాగా ఆయన హయాం లోనే 2017-22 కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. కె రమేష్ హయాంలో ఎ సి బస్ షెల్టర్ ఏర్పాటు.. చెట్లకు గోడలకు రంగులు.. ఉప్పుటేరు వార్ఫ్ రోడ్డులో ఆరున్నర కోట్ల రూపాయలు వృధా చెందే పార్కు నిర్మాణం వంటి అనేక నిరుపయోగ పనులు కార్పోరేషన్ కు ఆదాయ ప్రణాళిక లేకుండా జరిగాయి. వర్షాల్లో మురుగునీరు పారించే డ్రయినేజీ వ్యవస్థ లేకుండా బాగున్న రోడ్ల మీద సిమెంటు రోడ్లు, డ్రైన్ టు డ్రైన్ వేసి ఎత్తు చేయడం.. కుళాయి చెరువు రక్షిత విక్టోరియా వాటర్ వర్క్స్ ప్రాంగణంలో స్మార్ట్ సిటీ కంపెనీ భవన నిర్మాణానికి తావు కల్పించారు.. అప్పటికే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు లో రు.520కోట్ల వర్కులు జరిగాయి. అప్పటి 2019 అసెంబ్లీ ఎన్నిక ల్లో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే స్థానిక స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగం పై అప్పట్లో బహిరంగ విచారణ విజిలెన్స్ దర్యాప్తు జరిపిస్తామని బాహాటంగా సవాళ్లు చేయడం గమమార్గం. జనవరి 2021 నుండి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 2022 ఏప్రిల్ వరకు పని చేశారు. వీరి హయాంలో పి ఆర్ కళాశాల వ్యవస్థ పాడయ్యే విధంగా దుమ్ము ధూళిలో ఈట్ స్ట్రీట్ .. రహదారులు ఇరుకు చేసే సైకిల్ ట్రాక్ .. మోడు బారించిన చెట్లు.. ఇళ్ళు లోతట్టు అయ్యే రీతిలో నీరు నిలబడిన ప్రతి వీధిలోనూ రోడ్ల మీద రోడ్లు యధేచ్చగా నిర్మించబడ్డాయి. డంపింగ్ యార్డ్ భూములు సేకరించ కుండా తడి చెత్త పొడిచెత్త ప్రహసనం ఎక్కువ చేశారు. ఇతర శాఖలకు రు.150కోట్ల మేర జనరల్ నిధులు పూర్వపు కమీషనర్ కె రమేష్ హయాం కంటే మెండుగా తరలిపోయాయి. బంగ్లాలో జలకాలాటకు స్విమ్మింగ్ ఫూల్ కట్టించుకున్న ట్టుగా ఆయాచిత అడ్డగోలు తీర్మానాలకు సహకరించి అనుచిత పనులకు అవకాశాలు కల్పించారు. వెరసి రు.1,050కోట్లు స్మార్ట్ సిటీ పద్దు ఖర్చు అయ్యింది. జనరల్ నిధులు రు.500కోట్లు తీవ్రంగా దుర్వినియోగం అయ్యాయి. కార్పోరేషన్ స్థలాల పార్కుల ఆస్తుల ఆక్రమణలు జరిగాయి. నిధులు మంజూరు లేక గోదావరి కళాక్షేత్రం.. సైన్స్ సెంటర్ .. సినిమా రోడ్డు లోని కార్పోరేషన్ ఏడంతస్తుల మేడ.. మున్నగు పనులు ముందుకు సాగక నడిసంద్రంలో నావలా వున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల ఆస్తిపన్ను బకాయి, కుళాయి పన్ను బకాయి అపరాధ రుసుములతో రు.62కోట్లుగా వుంది. స్మార్ట్ సిటీ ప్రణాళిక నిధులు గతంలో ఒక సారి ఆగిపోయాయి. మరలా పునరుద్దరణ కావడం వలన పనులు జరిగాయి. ఇప్పుడు మరలా అదే దుస్థితి ఎదురయ్యే పరిస్థితుల్లో స్మార్ట్ సిటీ ప్రణాళిక పద్దు ఆగిపోతే రు.400 కోట్ల భారం కార్పోరేషన్ భరించాల్సి ఉంటుంది. స్మార్ట్ సిటీ నిధులు ఉచిత గ్రాంట్ కాదు. కేంద్రతలసరి గ్రాంటుగా ఏటా వచ్చే నిధుల నుండి 25శాతం కేంద్రం, మరో 25శాతం రాష్త్రం, మరో 25శాతం కార్పోరే షన్ వాటాగా తెచ్చిన ముందస్తు అడ్వాన్స్ నిధులు. వీటికి మరో 25శాతం ప్రయివేటు పెట్టుబడి భాగస్వామ్యం నిధులతో ఏర్పడిన జాతీయ ప్రాజెక్ట్ గా స్మార్ట్ సిటీ చట్రం ఏర్పడింది. వీటన్నింటినీ కాకినాడ కు వచ్చే భవిష్యత్తు నిధుల్లో కేంద్రం, రాష్ట్రం స్మార్ట్ సిటీ లో ఇచ్చిన తన వాటా సొమ్మును మినహాయింకుంటుంది.స్మార్ట్ అజెండాగా పార్కులు మైదానాలు మార్కెట్లు ప్రయివేట్ పరం చేయడం ప్రధమ అధ్యాయం. ఇందులో భాగంగానే చెత్త పన్నులు ప్రవేశ పెట్టిన ఘనత రాష్ట్ర నిర్ణయం కంటే 6నెలల ముందు గా ప్రవేశపెట్టి ఏకగ్రీవం గా కౌన్సిల్ తో ఓకే చేయించిన స్మార్ట్ సిటీ కాకినాడ రికార్డ్ దేశ స్మార్ట్ సిటీ ల్లో నెంబర్ వన్ ప్లేస్ ఇచ్చింది. అందుకే నివాసిత యోగ్య నగరాల్లో 4వ స్థానంగా అవార్డు కూడా వచ్చింది. ఎండల్లో కాంక్రీట్ జంగిల్ గా వర్షాల్లో ముంపుసిటీ గా కాకినాడ కుదేలయ్యిం ది. ముంపు మోక్షం రావాలంటే రేచర్ల పేట రైల్వే పునరుద్ధరించాలి. చీడీల పోర కు కవర్ డ్రైన్ నిర్మించాలి. పిడబ్ల్యూడి కాలువ వాడుక లోకి తేవాలి. కుదించుకుపోయిన ఉప్పుటేరు వెడల్పు చేసే పనులు చేపట్టాలి. ఇంద్రపాలెం ఉప్పుటేరు లో మేట వేసిన మేడ లైను వంతెన అక్రమ కట్టడాలు తొలగించాలి.
అవుట్ లెట్ మార్గాలు వెడల్పు చేయాలి. ఆర్ అండ్ బి కల్వర్ట్లు విస్తరించాలి. ప్రధాన రహదారులన్నింటామేజర్ డ్రైన్ నిర్వహణ చేపట్టాలి. నిధులు వృధా చెందాయి. ముందస్తు నిధులతో దుబారా జరిగింది. ఆదాయ బకాయిలు బ్రేక్ అయ్యాయి. కోర్టు వ్యాజ్యం తో ఆస్తి విలువ ఆధారిత పన్నులు చెల్లింపు ఆగిపోయాయి. ఆర్థిక సంఘం గ్రాంట్లు మినహా మరే నిధులు రావడం లేదు. జనరల్ పనుల కాంట్రాక్టర్లకు రు.20కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. ప్రభుత్వ నిధులు కరెంటు బిల్లుల బకాయిలకు పోతున్నా యి. స్థానిక కార్పోరేషన్ పరిస్తితి దేశంలో స్మార్ట్ సిటీ పేరిట పల్లకీ మోతగా వుంటే.. జిల్లా కేంద్రం ముంపువాడగా ఆర్థిక పరిస్తితి ఈగల మోతగా తయారయ్యింది. ఏడేళ్ల స్మార్ట్ సిటీ చట్రంలో విజిలెన్స్ ఎ సి బి దర్యాప్తు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నా రు. సీనియర్ ఐ ఎ ఎస్ ను కమీషనర్ గా నియమిస్తే పరిస్తితి గాడిన పెట్టే అవకాశం వుంటుందని పేర్కొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement