వకరికి మెమో, మరొకరికి షాకాజ్ నోటీసు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ న్యూస్:
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ .నాగ నరసింహారావు 6వ సర్కిల్ పరిధిలోని 22 వ డివిజన్ లో పారిశుద్ధ్య పనులు ఆకస్మిక తనిఖీ చేశారు.జె.రామారావు పేట ప్రాంతంలోని బడేవారి వీధి, జోగా వారి వీధిలో ఆయన పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించారు. ఇంటికి చెత్త సేకరణ తీరును పరిశీలించారు. డ్రైనేజీల నిర్వహణ, చెత్త సేకరణ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.విధి నిర్వహణలో అలసత్వం పై కమిషనర్ మండిపడ్డారు. శానిటరీ ఇన్స్పెక్టర్ వై ఆర్ ఎల్.రెడ్డికి మెమో ఇచ్చారు.శానిటేషన్ సెక్రటరీ ఎమ్.శ్రీను కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజల నుంచి కూడా సహకారం ఎంతో అవసరం అన్నారు.చెత్తను రోడ్ల పైన డ్రైవ్లలోను వేయవద్దని కమిషనర్ కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో మెరుగైన ర్యాంకు సాధించే దిశగా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఆయన వెంట ఎం హెచ్ ఓ డా. పృద్వి చరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ. సిబ్బంది ఉన్నారు.