Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రజల ఆకాంక్షలు… ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, సామర్లకోట:

మంత్రి వేణు సామర్లకోట, విశ్వం వాయిస్ న్యూస్: ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ ఆశయాల కనుగుణంగా మండల, గ్రామ స్థానిక సంస్థల ప్రతినిధులు అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచారపౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కోరారు.
సామర్లకోట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ సమావేశ హాలును రాష్ట్ర మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీతా విశ్వనాధ్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు లతో కలిసి ప్ర్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 24 లక్షల రూపాయలతో మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనం మొదటి అంతస్తులో సమావేశ హాలు, వీడియో కాన్ఫరెన్స్ హాలులను నిర్మించారు. ఈ సందర్భంగా సామర్లకోట ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. స్వయంగా తాను రాజకీయ ఓనమాలు దిద్దుకుని, పరిణితి చెందిన ప్రజా సేవకుడిగా, రాష్ట్ర మంత్రిగా ఎదగడానికి స్థానిక సంస్థల ప్రతినిధిగా గడించిన అమూల్య అనుభవాలే దోహదం చేశాయన్నారు. పంచాయితీ రాజ్ వ్యవస్థ పాలనా వికేంద్రికరణకు దోహదం చేస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్న, చారిత్రక ఒరవడిగా అమలులోకి తెచ్చిన గ్రామ సచివాలయ, గ్రామ వాలంటీరు వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, సుపరిపాలనా ఫలాలను ప్రజలకు వారి గడపలోనే అందుబాటులోకి తెచ్చాయన్నారు. తమ గత వైఫల్యాలను మరిచిపోయి, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జనరంజకంగా అందిస్తున్న సంక్షేమ పాలనపై కొందరు, కొన్ని పత్రికలు, ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారాలు, దుష్ట ప్రచారాలను విజ్ఞత కలిగిన రాష్ట్ర ప్రజలు నమ్మరని, ప్రజల ఆదరాభిమానాలు ఎన్నటికీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పట్ల సుస్థిరంగా ఉంటాయన్నారు. ఇటీవవలి స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక సంఖ్యలో ఎంపిపిలు, ఎంపిటిసిలు,జెడ్పిటిసిలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాలన పట్ల ప్రజలు హర్షానికి నిలువెత్తు దర్పణం పడుతోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిదులు అంకిత భావంతో సేవలు అందించి ఈ ప్రజాదరణను చెక్కుచెదరనీయకుండా చిరకాలం నిలపాలని కోరారు. నూతనంగా నిర్మించిన సమావేశ హాలు ప్రజోపయోగ చర్చలు, ప్రణాళికలకు వేదికగా నిలిచి, మరింత మెరుగైన సేవలందించేందుకు దోహదం కావాలని మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కాక్షించారు.
కాకినాడ ఎంపి వంగా గీత విశ్వనాధ్ మాట్లాడుతూ 2009 జెడ్పిచైర్మన్ గా సామర్లకోట మండల పరిషత్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి వేణగోపాలకృష్ణ చేతుల మీదుగానే మొదటి అంతస్తు ప్రారంభం కావడం ముదాహమని, ఆయన హస్తవాసితో భవనం మరిన్ని హంగులతో మరింత అభివృద్ది కావాలని కాక్షించారు. ప్రజలకు చేరువలో ఉండి వారితే మమేకమై సేవలు అందించే అపూర్వ అవకాశాన్ని స్థానిక సంస్థల ప్రతినిధులు సద్వినియోగం చేసుకుని మన్ననలు పొందాలని కోరారు. నూతన భవన వసతి సమకూరిన సందర్భంగా సామర్లకోట మండల పరిషత్ అధ్యక్షులు, సభ్యులకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు బొబ్బరాడ సత్తిబాబు, సభ్యులు మంత్రి, ఎంపిలను ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట జెడ్పీటీసీ ఎలిశెట్టి అమృత, రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్ చైరపర్సన్ ఆవాల రాజేశ్వరి, సామర్లకోట మున్సిపల్ చైర్పపర్సన్ గంగిరెడ్డి అరుణ, వైస్ చైర్పర్సన్ వుబా జాన్ మోజేష్,ఎంపిడిఓ కె.నరేంద్రరెడ్డి, తహశీల్థారు వి.జితేంద్ర, ఈఓపిఆర్డి సూర్యనారాయణ, పలువురు పట్టన, మండల ప్రముఖులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement