Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వృద్ధాప్యంలో ఉన్న తల్లితండ్రులను ప్రేమగా చూసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:

 

ముమ్మిడివరం-విశ్వం వాయిస్ న్యూస్:
ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో రిడీమ్ ఇండియా మినిస్ట్రీ చైర్మన్ రెవ. డాక్టర్ బీర మనోహర్ జేమ్స్ తండ్రి రెవ. డా. బీర డేవిడ్ బ్రైనాడ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది క్రైస్తవులు, పాస్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రిడీమ్ ఇండియా మినిస్ట్రీస్ ఫౌండర్, చైర్మన్ మనోహర్ జేమ్స్ మాట్లాడుతూ కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలని తెలిపారు. నేను ఉన్నత స్థానానికి చేరటానికి మా నాన్నగారే కారణమని నన్ను కష్టపడి పెంచి పెద్దచేసి చదివించారని, ఆయన రుణం తీర్చుకునే విధంగా పేదలకు నా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తున్నానని, ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసి బహుమతులు ప్రదానం చేశానని తెలిపారు. అదేవిధంగా రిడీమ్ ఇండియా మినిస్ట్రీస్ ద్వార అనేకమైన సంఘసేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్ కుమార్, బీర డానియల్ కెనడి, బిషప్ డాక్టర్ ఏకె. మూర్తి, వి.వి సామ్యూల్ జ్యోతి, వీధి డేవిడ్ జ్యోతి, శరత్ బాబు, యు. ప్రసాద్, ఎం. దైవదాసు, సుంకర మోజెస్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement