Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అక్రమాల తొలగింపు చేపట్టిన అధికారులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రావులపాలెం రింగ్ రోడ్డులో ఆక్రమణల తొలగింపు
ప్రారంభం
– లోకాయుక్త ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

 

రావులపాలెం(విశ్వం వాయిస్) కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని రింగ్ రోడ్డులో అధికారులు శుక్రవారం ఆక్రమణల తొలగింపు చేపట్టారు. లోకాయుక్తలో గ్రామానికి చెందిన కె.గంగిరెడ్డి 2016లో చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అధికారులు చర్యలు ప్రారంభించారు. స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నుంచి బొబ్బర్లంక రోడ్డులో ఆంజనేయస్వామి ఆలయం వరకు ఉన్న రింగ్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. తహశీల్దార్ వి.వి.వి సత్యనారాయణ, ఆర్ అండ్ బి జేఈ మణికుమార్, గ్రామ కార్యదర్శి ఎల్.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రెండు జేసీబి యంత్రాలతో ఆక్రమణలను తొలగింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో రోడ్డు పక్కన రేకుల షెడ్లలో ఉన్న హోటళ్ళు, పాన్ షాపులు, జ్యూస్ షాపులను తొలగించారు. మధ్యాహ్నం వరకు బాలికల హైస్కూల్ వద్ద నుంచి కోనసీమ ముఖద్వారం వరకు ఆక్రమణలు తొలగించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ సత్యనారాయణ, ఆర్ అండ్ బి జేఈ మణికుమార్ మాట్లాడుతూ రావులపాలెం రింగ్ రోడ్డులో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను తొలగించాలంటూ కె.గంగిరెడ్డి 2016లో లోకాయుక్తలో చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపు చేపట్టామని చెప్పారు. సుమారు రెండు నెలలుగా ఆక్రమణల్లో ఉన్న వారికి పలు మార్లు నోటీసులు జారీచేసి స్వచ్చందంగా ఆక్రమణలు తొలగించుకునే అవకాశం ఇచ్చామని చెప్పారు. ఎక్కడి వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడి వరకూ మార్కింగ్ ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ కొంతమంది తొలగించక పోవడంతో యంత్రాలతో తొలగిస్తున్నామని చెప్పారు. రికార్డుల ప్రకారం రింగ్ రోడ్డు సుమారు 25 నుంచి 40 మీటర్ల వెడల్పున ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతానికి తాత్కాలిక నిర్మాణాలు తొలగిస్తున్నామని, మార్కింగ్ ఇచ్చిన పరిధిలో పక్కా భవనాలు ఉన్నా నిబంధనల మేరకు తొలగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.ఐ ఎండీ ఇబ్రహీం, వి.ఆర్వో లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement