– చంద్రబాబు కు జిల్లా ప్రజల నీరాజనం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అడుగు పెట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. అయితే రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ నుండి సర్పవరం జంక్షన్ మీదుగా భానుగుడి సెంటర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని, ప్రజలపై పన్నుల భారం వేసి, అదే డబ్బులను కొంత దాచుకొని, మరి కొంత సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే సంక్షేమ పథకాలు కొంతమందికే అందుతున్నాయని, మిగిలినది జగన్ ఖాతాకు వెళ్లి చేరుతుందని ఆరోపించారు. అంతేగాక ఈ మూడు సంవత్సరాలకాలంలో చేసిన అప్పలకు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఇంకా ఎవరు కూడా రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ముందుకు రారు.. భయపడి చేతులు ఎత్తేసారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు.. యువతకు ఉపాధి లేదు.. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు.. మరో వైపు పన్నుల భారం రోజు రోజుకు పెరుగుతోందని వ్యాఖ్యానించారు. తెల్లవారితే దేనిమీద పన్ను విధిస్తారోనని ప్రజలు భయపడే పరిస్థితికి రాష్ట్రన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఇంకా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. నేను ప్రజలకు అండగా ఉంటానని ప్రతి కుటుంబంనుంచి ఒక వ్యక్తి సైనికుడిలా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్రం వదిలి పోయేవరకు తరిమి కట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మసీదు సెంటర్,జగన్నాధపురం మీదుగా కోరంగి చేరుకున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమయాత్ర లో స్థానిక పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ప్రముఖ వ్యాపార వేత్త తెలుగుదేశం పార్టీ నాయకుడు గుణ్ణం చంద్రమౌళి, టిడిపి పార్టీ అధ్యక్షుడు మళ్లిపూడి వీరు,అమన్ జైన్,తుమ్మల రమేష్,జహీరుద్దీన్ జీలాని,సయ్యద్, తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.