Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జోరుగా సాగుతున్న ఉపాధి హామీ పనులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అకాల వర్షాలకు కూలీలు దొరక్క రైతులు ఇక్కట్లు
కాట్రేనికోన మండలం పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు
జోరుగా కొనసాగుతున్నాయి గత వారం రోజుల నుంచి
అకాలంగా కురుస్తున్న వర్షాలతో కూలీలు దొరక్క రైతులు
పడుతున్న ఇక్కట్లు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:

 

కాట్రేనికోన ( విశ్వం వాయిస్ )
న్యూస్:-
కాట్రేనికోన మండలంలో గత వారం రోజుల నుంచి అకాలంగా కురుస్తున్న వర్షంతో రైతులు గుండెల్లో గుబులు రేపుతోంది రైతులు దుక్కి దున్ని నారు వేసిన అప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అనేక ఇబ్బందులు పడి గత ఐదు నెలల నుంచి కాపాడుకుంటూ వచ్చిన పంట ప్రస్తుతం రబీ కు సంబంధించి రైతులు వరి కోతలు విషయంలో ఆందోళన చెందుతున్నారు ఈ సమయంలో కూలీలు దొరక్కపోవడంతో కోతలు ఏవిధంగా సాగుతాయో తెలియక ఆందోళన చెందుతుంటే ఒకవైపు అకాల వర్షాలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి మిషన్ల ద్వారా పంటను కోసి నప్పటికీ పశుగ్రాసం లేక కొంతమంది రైతులు మిషన్ లపై ఆసక్తి చూపడం లేదు అటువంటి రైతులు కూలీల కోసం ఎదురుచూస్తున్నా ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామీ పనులు మే నెలాఖరు వరకు వాయిదా వేసి కోతలు పూర్తయినా తర్వాత కొనసాగించాలని కొంతమంది రైతులు కోరుతూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ వారికి పలుమార్లు రైతులు ఫిర్యాదు చేశారు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వరి పంటలు పండించమని చెబుతున్నారు ఇప్పటికే కోనసీమలో చాలా మంది రైతులు తమ వ్యవసాయ భూములను రొయ్యలు చేపల చెరువులుగా మార్చి లీజుకు ఇచ్చేశారు మిగతా వారు కూడా ఇదే మార్గాన్ని అనుసరించడంలో ఆసక్తి చూపుతున్నారు అని కొంత మంది రైతులు వాపోతున్నారు జిల్లా కలెక్టర్ వారు రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement