Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రైతు భరోసా కేంద్రలో 2022-23 అర్హత జాబితా…..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: రాయపోల్ మండల పరిధిలో ఉన్న 19 రైతు భరోసా కేంద్రాల్లో డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా 2022-23
సంవత్సరానికి మొదటి విడత అర్హత జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని మండల వ్యవసాయ అధికారి కే ప్రభాకర్ విలేకరులకు తెలిపారు. మండలంలో వెదురుపాక రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం రైతు భరోసా జాబితాలను మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో వెదురుపాక సర్పంచ్ మల్లిడి సూరారెడ్డి చేతులమీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో ప్రభాకర్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా మొదటి విడత అర్హుల జాబితాను సామాజిక తనిఖీ నిమిత్తం రైతు భరోసా కేంద్రాలలో నోటీస్ బోర్డ్ లో పెట్టడం జరిగిందన్నారు. రైతుల సమక్షంలో సమాజిక తనిఖీ నిమిత్తం మే 6, 7, 8 తేదిలు ఈ మూడు రోజులు రైతు రైతు భరోసా కేంద్రం లో ఉంచడం జరుగుతుందని ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే సంబంధిత వ్యవసాయ సహాయకులకు తెలియపరచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మండా వెంకట పద్మావతి, గ్రామ నాయకులు వాసంశెట్టి గోపి కృష్ణ, తాడి బుల్లి వెంకట రెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు తులసిదర్ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement