Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,466,078
Total recovered
Updated on September 27, 2023 2:43 AM

ACTIVE

India
557
Total active cases
Updated on September 27, 2023 2:43 AM

DEATHS

India
531,930
Total deaths
Updated on September 27, 2023 2:43 AM

గిరిజన సంఘం, సిపియం పార్టీ ఆధ్వర్యంలో గనంగా అల్లూరి వర్ధంతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చిత్తూరు:

చింతూరు – విశ్వం వాయిస్ న్యూస్

బ్రిటీష్ వారిని గడగడలాడించిన మన్యంవీరుడు ఆదివాసీ ప్రజల గుండెల్లో ఉద్యమ నాయకుడిగా నిలిచిన స్ఫూర్తి ప్రదాత అల్లూరిసీతారామరాజు వర్థంతి సభను గిరిజనసంఘం ఆద్వర్యంలో చింతూరు  మండలం కేంద్రం లో  ఘనంగా నిర్వహించరు.
ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  కుంజా సీతారామయ్య పూలమాలలు వేసి ఘనంగానివాళులు అర్పించారు.అనంతరం జరిగిన గిన సభలో సీతారామయ్య మాట్లాడుతూ  స్వేచ్ఛగా అడవిలో జీవనం సాగిస్తున్న గిరిజనులను బ్రిటీష్ ప్రభుత్వం వ్యాపారం పేరుతో  వెట్టి చాకిరి చేయిస్తూ  ,తీవ్రమైన దోపిడీ  చేస్తున్న సమయంలో గిరిజనులకు అండగా గంటందొర,మల్లుదొర,పడాల్ ల సహాయంతో అల్లూరి గిరిజన పోరాటాన్ని 1922-1924 మధ్య కాలంలో నడిపించారని ఆయన గుర్తు చేశారు.
నేడు స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్ళు గడిచినా వారి జీవనంతో పెనవేసుకుని ఉన్న అడవి నుంచి గిరిజనులను దూరం చేయాలని ఈ భారత పాలకులు కుట్రపూరిత విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు.అందులో భాగమే అడవిలో వెళ్లాలంటే అటవీ శాఖా అధికారుల అనుమతి తప్పనిసరి అనే నిబంధనలను అటవీ శాఖా అధికారులు పెడుతున్నారని,వంటచెరకు,ఇంటి అవసరాలకు కావలసిన సామగ్రిని కూడా తెవొద్దంటూ ఆంక్షలు పెడుతూ,విచక్షణంగా రుసుములు విధిస్తూ గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.మరో ఆదివాసీ పోరాటానికి దారితీసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని,ప్రభుత్వాల తీరు మార్చుకొని గిరిజనుల హక్కులు,చట్టాలను అమలు చేయాలని లేదంటే భవిష్యత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.ఈ వర్థంతి సభలో సి పి ఎం రాష్ట్ర కమిటీ నాయకులు ఎర్రం శెట్టి శ్రీనివాస్, పల్లపు వెంకట్,  సీసం సురేష్,  ఎంపిటిసి వేక రాజకుమార్, ఎడమ సుబ్బమ్మ, సవలం నారాయణ, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!