Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రైతులకు వేగంగా చెల్లింపు బాధ్యత తీసుకుంటాం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– అర్బీకె కి దాన్యం అమ్మండి..
– కొనుగోలు చేసి మిల్లర్ పంపే బాధ్యత ప్రభుత్వానిదే..
జేసీ శ్రీధర్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, సీతానగరం:

 

– అర్భికే కి ధాన్యం అమ్మం

సీతానగరం, విశ్వం వాయిస్ః

రైతులు ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని, ప్రభుత్వం ద్వారా రైతులకు వేగంగా చెల్లింపు భాధ్యత తీసుకుంటానని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం సీతానగరంలో అర్భికే కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా, జేసీ శ్రీధర్ మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి ఒక్క ధాన్యాన్ని నిర్భయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కు తరలించాలన్నారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి, మిల్లులకు పంపించే ఏర్పాట్లు మేము చెయ్యగలమన్నరు. పంట కోత సమయంలో కూలీలు, గోనె సంచులు వివరాలు, పంటను అర్భికేకి పంపే సందర్భంలో హమాలీలు, రవాణా వివరాలపై రైతులతో సంభాషించారు. ధాన్యం కొనుగోలు చెయ్యడమే కాకుండా, త్వరలో నగదు మీ ఖాతాలో జమ అవుతుందని హామీ జేసీ ఇచ్చారు. అకాల వర్షాలు కురిస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అవసరమైన పట్టాలు ఉన్నాయా అని వాకబ్ చేశారు. మీవద్ద నుంచి కొనుగోలు సమయంలో ఎవరైనా, ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా అని ప్రశ్నించాగా, ఎటువంటి ఇబ్బందులు పెట్టడం లేదని రైతులు తెలిపారు. ఈ సందర్భంలో రైతులు కూడా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి మన వద్దకు వొచ్చి భరోసా ఇవ్వడంతో సంతృప్తి పరచడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. సీతానగరం పరిధిలో ఉన్న వ్యవసాయ భూమి వివరాలు, ఎంత విస్తీర్ణం లో ప్యాడి పంట వేశారు, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల్లో పంట కోత అయిన వివరాలు తెలుసుకున్నారు. ఇంకా ఎంత విస్తీర్ణంలో కోత చెయ్యాల్సి ఉందని ప్రశ్నించారు. రికార్డు లను పరిశీలించి తదుపరి కార్యాచరణపై సూచనలు చేశారు. ధాన్యం సేకరణ కి అవసరమైన గోను సంచెలు ఉన్నాయా అని అడిగి ఎటువంటి ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ తనిఖీల్లో జేసీ వెంట తహశీల్దార్ ఎమ్. పవన్ కుమార్, మండల వ్యవసాయాధికారి రమేష్, అర్భికే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement