Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,163,883
Total recovered
Updated on March 26, 2023 8:58 PM

ACTIVE

India
9,433
Total active cases
Updated on March 26, 2023 8:58 PM

DEATHS

India
530,831
Total deaths
Updated on March 26, 2023 8:58 PM

వార్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– రికార్డు లు నిర్వహణ ఎప్పటికప్పుడు నవీకరణ చెయ్యాలి
– కమిషనర్ దినేష్ కుమార్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః

వార్డు సచివాలయాల్లో రికార్డ్ లు అన్నీ ఎప్పటికప్పుడు సమాచారం పొందు పరుస్తూ నవీకరణ (అప్డేట్) గా ఉండాలని నగరపాలక సంస్థ కమీషనర్ కె దినేష్ కుమార్ ఆదేశించారు. శనివారం రాత్రి 7.30 కి స్థానిక 32, 5, 8 వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఏ సమయంలో మౌలిక వసతులు కల్పిస్తున్నమో ఆసమయం లో క్షేత్ర స్థాయి లో అధికారులు సిబ్బంది ఉండాలన్నారు. హాజరు రిజిస్టర్, ,కాష్ బుక్, ఇతర కార్యాలయ లెడ్జర్ లను పరిశీలించి తగు సూచనలు చేశారు. డేటా ఎంట్రీ గానీ, సమస్యల పరిష్కారం గానీ నిర్దేశిత సమయం లోనే పూర్తి అయిపోవాలని, పరిష్కారం కాని అంశాలు అధికారుల, సంబంధించి న అడ్మిన్ ల దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. జగనన్న గృహ లబ్దిదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గృహ నిర్మాణ విషయం లో లబ్ధిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు వివరిస్తూ త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టేలా లబ్ధిదారులకు వివరించాలన్నారు. వార్డులలో శానిటేషన్ ప్రక్రియ గురించి సమాచారం తీసుకున్నారు. రోడ్ పై ఎక్కడా చెత్త పోగులు గా కనిపించరాదన్నారు. వార్డు ఎమినిటీస్ సెక్రెటరీ, శానిటేషన్ సెక్రెటరీ లు ఉదయం ఆరు గంటలకల్లా వార్డు లో హాజరవ్వాలని, శానిటేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మాలిక్, తదితరులు కమీషనర్ వెంట ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!