– కలెక్టర్ డా. కె. మాధవీలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజానగరం:
రాజానగరం, విశ్వం వాయిస్ః
వెలుగుబంద కాలనీలో పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని మరింత వేగవతం చెయ్యలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు.
శనివారం రాజానగరం మండలం వెలుగుబంద జగనన్న హౌసింగ్ లే అవుట్ల మునిసిపల్ కమిషనర్ దినేష్ కుమార్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా జగనన్న లే అవుట్ పరిధిలో ఇళ్ల నిర్మాణంవేగవంతం చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వెలుగు బంద లో అత్యధిక ఇళ్ల స్థలాలు అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగతుందన్నారు. మరింత వేగంగా ఇంటి నిర్మాణాలు కోసం పర్యవేక్షణ కై 68 ఇంజనీరింగ్ సహయకులు ఉన్నట్లు తెలిపారు. రబీ సీజన్ పూర్తి అయ్యిందని, రానున్న నెలన్నర రోజులు పొడి వాతావరణం ఉంటుందని, లబ్ధిదారులకు అవగాహన ఏంటి వీలైనంత త్వరగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇంటి నిర్మాణాలకు అవసరమైన ముడిసరుకు లే అవుట్ లలోనే అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటి నిర్మాణం కోసం అవసరమైన సిమెంటు ఇసుక ఇనుము అందుబాటులో ఉండడంతో లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం ఉందన్నారు. మరింత వేగంగా పనులు చెయ్యడం సాధ్యం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇళ్ళ నిర్మాణాలు చేపట్టడంలో లబ్ధిదారులకు అవగాహన పెంచే దిశలో, క్షేత్ర స్థాయి సిబ్బందికి పరిపాలన సౌలభ్యం కోసం ప్రత్యేకంగా కార్యదర్సులను కూడా నియమించడం జరిగిందన్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా ఈ లే అవుట్ లో తొలిదశలో ఆసక్తి చూపిన 6,156 మంది లబ్ధదారులచే, రానున్నరోజుల్లో వెలుగుబంద జగనన్నకాలనీ ఒక పెద్దమేజర్ పంచాయతీ గా రూపుదిద్దుకోడం ఖాయం అన్నారు. ఇప్పటికే ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్దిదారులతో మరికొందరికి స్పూర్తి కల్పించాలన్నారు. వివిధ దశల్లో ఉన్న ఇంటి నిర్మాణాలను మరింత వేగవంతం చేసే దిశలో అడుగులు వేయాలన్నారు. ఆర్థికంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేవలం ఈ లేఅవుట్ లో ఆశించిన స్థాయిలో ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నారని, మిగిలిన వారితో కూడా ఇంటి నిర్మాణం ప్రారంభింప చెయ్యాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆరు మంది “యమీనిటీ కార్యదర్శి” వారితో పాటు , వెల్ఫేర్ కార్యదర్శి నియమించిన దృష్ట్యా పనులు వేగవంతం చేయాలన్నారు.
కమీషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ వెలుగుబంద జగనన్న కాలనీ లే అవుట్ లో 13 వేలకు పైగా ఇండ్ల స్థలాలు ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్ లు ఇక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టడంలో మరింతగా దృష్టి పెట్టాలని కోరారు. ఈ ప్రాంతం మరో చిన్న సిటీగా అభివృద్ధి అవ్వడం ఖాయమన్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంటి నిర్మాణాలు పూర్తి అయితే ఒక చిన్న పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.
ఈ పర్యటనలో హౌసింగ్ పిడి బి. తారాచంద్, అడిషనల్ కమిషనర్ సత్యవేణి, హౌసింగ్ ఈ ఈ జీ.సోములు, డీ ఈ లు, ఏ ఈ లు, వర్క్ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.