Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజు వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన టిడిపి నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం (విశ్వం వాయిస్)
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లవరం మండలం గుండిపూడి గ్రామంలో అమలాపురం నియోజకవర్గం రైతు అధ్యక్షులు వేగిరాజు వెంకటరాజు అధ్యక్షతన, రెల్లి గడ్డ గ్రామంలో నడింపల్లి చంటి రాజు అధ్యక్షతన అల్లవరం మండల అధ్యక్షులు దెందుకూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనంద రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.నెత్తురు మండే యువతకు ఆరాధ్యుడు మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని హడలుగొట్టి వీరుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ గొప్ప యోధుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆనంద రావు మాట్లాడుతూ మన్యం ప్రాంతంలో బ్రిటీషు వారిని ఎదిరించి బ్రిటిష్ వారి ఆయుధాలను ధ్వంసం చేసి తెలుగోడి సత్తా చాటిన గొప్ప విప్లవ పోరాట నాయకుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు .దెందుకూరి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ భారత ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జయంతి ,వర్ధంతు లను అధికారికంగా గుర్తించిందని తెలుగు రాష్ట్రాలు ఈ సందర్భంలో వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని శనివారం అల్లవరం మండలం లో తెలుగుదేశం పార్టీ మరియు పెద్దల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి జరుపుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ నాయకులు చింతా శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, అమలాపురం పార్లమెంట్ ఎస్సీ సెల్ కార్యదర్శి తోట నరసింహారావు , గ్రామ కమిటీ అధ్యక్షులు కొల్లు విష్ణుమూర్తి, నడింపల్లి చంటి రాజు, కొప్పిశెట్టి రామకృష్ణ ,మండల తెలుగు యువత అధ్యక్షులు ముత్యాల బాబి, బీసీ సెల్ అధ్యక్షులు గెద్దాడ శ్రీనివాసరావు, ఎస్సి సెల్ అధ్యక్షులు పశ్చిమాల ఏడుకొండలు, పోతుల సుభాష్ చంద్రబోస్, పోతుల నరసింహారావు ,గూడూరి పెద్దబాబు, పరసా కిరణ్ ,నార్గన శ్రీనివాసరావు, గుంటూరి బాలరాజు, గుంటూరి సోమరాజు, గుంటూరి శ్రీ రామ రాజు, పొత్తూరి రంగరాజు పెన్నమరాజు నరసింహరాజు, గుంటూరి శివ, గుంటూరి శివరామరాజు ,పెన్నమరాజు కల్లేపల్లి రామరాజు ,నడింపల్లి సాయి రాజు, నడింపల్లి వెంకట రాజు ,నడింపల్లి సత్తిరాజు, పెనుమత్స వెంకట సత్యనారాయణ రాజు, నడింపల్లి బంగార్రాజు, నడింపల్లి వీరభద్ర రాజు, నడింపల్లి నాగరాజు , రామరాజు, బొర్రా రాజేష్, మామిడిశెట్టి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement