WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

జన్మనిచ్చేది అమ్మ…కల్మషం లేనిది అమ్మ ప్రేమ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– అమ్మను మించిన దైవం లేదురా….

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

ఆకాశాన్ని అడిగితే చెబుతుంది అమ్మ ప్రేమ తన కంటే విశాలమైందని.. సాగరాన్ని అడిగినా చెబుతుంది అమ్మ మనసు కన కంటే లోతైనది అని.. కొండ తేనేను అడిగితే చెబుతుంది అమ్మ మమత తన కంటే తియ్యగా ఉంటుందని.. తియ్యని రాగాలు పలికే కోయిలను అడిగినా చెబుతుంది.. అమ్మ పిలుపు తన పాట కంటే అద్భుతమైనదని.. కొవ్వొత్తిని అడిగితే చెబుతుంది..
అమ్మ త్యాగం తన కంటే కోటి రెట్లు ఎక్కువని.. భూదేవిని అడిగినా చెబుతుంది.. అమ్మ అంటేనే ఓర్పు అని.. ఓర్పు అంటేనే అమ్మ అని.. అందుకే ఈ సృష్టిలో అమ్మే గొప్పది.. అమ్మ కన్నా మిన్న ఎవ్వరూ లేరు’ అని కొందరు కవులు, మేధావులు చెబుతుంటారు. అయితే అమ్మ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. అంత కమ్మనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుండి తొమ్మిది నెలల పాటు ఎంతో సహనంతో.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి పునర్జన్మనెత్తుకుంటుంది. అయితే అప్పటివరకు పడిన పురిటినొప్పులను కాస్త.. బిడ్డ ఒడిలో పడిన వెంటనే మరచిపోతుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు.. ఎప్పుడు జరుపుకుంటారు.. అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
*మే రెండో వారంలో..*
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే మాసంలోని రెండో ఆదివారం నాడు మాతృ దినోత్సవం(Mother’s Day) జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో మే 8వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. అయితే తల్లుల దినోత్సవం జరుపుకోవడం వెనుక ఓ పెద్ద చరిత్ర మరియు ఓ నేపథ్యం ఉంది.
*మదర్ ఆఫ్ గాడ్స్..*
గ్రీస్ దేశంలో ‘రియా’ అనే దేవతను ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా భావించి సంవత్సరానికి ఒకసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో బ్రిటన్లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాన్ని నిర్వహించేవారు. ‘జూలియవర్డ్ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది.
*మదర్స్ డే కోసం..*
అన్న మేరీ జర్విస్ అనే మహిళ ‘మదర్స్ ఫ్రెండ్ షిప్ డే’ జరిపించేందుకు ఎంతగానో క్రుషి చేసింది. ఆమె 1905 సంవత్సరంలో మే 9వ తేదీ మరణించగా.. ఆమె కుమార్తె మిస్ జెర్విస్ మాతృ దినోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది. దీంతో 1914 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు.
*మాతృ దినోత్సవాన్ని..*
ఇదే ఆనవాయితీని కాలక్రమేణా ప్రతి సంవత్సరం జరుపుకోవడం ప్రారంభించారు. అప్పటి ప్రతి ఏటా మే నెలలోని రెండో ఆదివారం మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
*ప్రత్యక్ష దైవమే అమ్మ..*
ఈ ప్రపంచంలో అత్యంత పేదవాడు అంటే డబ్బు లేని వాడు కాదు… ఎవరైతే అమ్మ ప్రేమను దక్కించుకోలేకపోతారో వారే అసలైన పేదవారు. అమ్మ ప్రేమను దక్కించుకున్నవారు అత్యంత కోటీశ్వరులు. బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి ‘మదర్ థెరిసా’నే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అమ్మ నడకతో పాటు నాగరికతనూ నేర్పిస్తుంది. అంతులేని ప్రేమానురాగాలను పంచుతుంది. ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement