Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గర్భిణీ స్త్రీలు పౌస్టికాహారం తీసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జిల్లా వాలంటరీ బ్లడ్ డోనర్స్ క్లబ్ చైర్మన్ వెలగల
పణి కృష్టారెడ్డి…

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
గర్భిణీ స్త్రీలు తల్లి కాబోయే ముందు పౌష్టికాహారం, యోగా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ డోనర్స్ అసోసియేషన్ క్లబ్ చైర్మన్ వెలగల పణి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ అంగర దేవి రాజశ్రీ ఆధ్వర్యంలో సోమవారం గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్లడ్ బ్యాంక్ డోనర్స్ క్లబ్ చైర్మన్ వెలగల పణి కృష్ణా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తల్లి కాబోయే ముందు పౌష్టికాహారం, యోగా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భిణీ సమయంలో యోగ ఎలా చేయాలో అవగాహన కల్పించారు. మెడికల్ ఆఫీసర్ అంగర దేవి రాజశ్రీ మాట్లాడుతూ ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి ఆదేశాల మేరకు గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రత్యేకమైన పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం యోగ మాస్టర్ వెలగల ఫణి కృష్ణారెడ్డి సౌజన్యంతో గర్భిణీస్త్రీలకు పౌష్టికాహారము పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వెలగల ఫణికృష్ణ రెడ్డి, సేవా సంస్థ సభ్యుడు బక్కి సందీప్, పి. వాణి కుమారి, మెడికల్ ఆఫీసర్స్ రమ్య శ్రీ, ఎమ్.ఎన్. ఓ సుబ్రహ్మణ్యం, ఆశవర్కలు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement