విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:
ఆత్రేయపురం: విశ్వం వాయిస్ న్యూస్: పార్టీ సభ్యత్వం వేగవంతం చేయాలని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి రైతుల పట్ల ఆవేదన వ్యక్తపరిచారు. తుఫాన్ ప్రభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వంధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలని సత్యానందరావు అన్నారు. సోమవారం ఆత్రేయపురం మండలం గ్రామ పార్టీ అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్) అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బండారు సత్యానందరావు పాల్గొని మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా ధాన్యం తడిసి ముద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. రైతులును దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్ళు ప్రారంభించాలన్నారు.పెరుగుతున్న ధరలు, ఛార్జీలు పెంపుదల ప్రభుత్వ భాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.రైతులకు ధాన్యం కనుకోలు విషయంలో న్యాయం జరిగేలా చూడాలని మండలంలో సంబంధిత అధికారులతో చర్చించడం జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే మండలం లోని తెలుగుదేశం పార్టీ సభ్భత్వ నమోదును వేగవంతం చేయాలని ఐటీడీపీ సహకారం తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో మండలంలోని ముఖ్య నాయకులు, మర్లపాలెం గ్రామ సర్పంచ్ మెర్ల రాము, వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, ర్యాలీ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, నల్ల సర్పంచ్ కాయలు జగన్నాథం ,క్లస్టర్, యూనిట్ ఇంఛార్జీలు, ఐటీడీపీ వారు మరియు యువత పాల్గొన్నారు.