Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సర్పంచ్ గుర్రా రాజు ఔదార్యం వృధులకు అన్నదానం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* పెళ్ళిరోజు వృద్ధుల సేవలో తరించిన కుటుంబం
* 80 మంది వృద్దులకు దుప్పట్ల పంపిణి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, మే 9, (విశ్వం వాయిస్ న్యూస్) ;

తమ వివాహ దినోత్సవ వేడుకలను సకుటుంబ సమేతంగా స్వగృహంలోనే జరుపుకోడం ఒక ఎత్తు. అదే వేడుకను ఓ సామాజిక ప్రయోజనంతో జన సమ్మర్ధంలో నిర్వహించుకుని సమాజ సేవలో తరించి పది మందికి ఆదర్శంగా నిలవడం మరొక ఎత్తు. ఈ రెండో విధానాన్నే అనుసరించింది సర్పంచ్ సకురు గుర్రాజు కుటుంబం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకూటం సర్పంచ్ సకురు గుర్రాజు, మల్లిక దంపతుల వివాహ వార్షిక వేడుకను అందరికీ కాస్త భిన్నంగా సోమవారం
నిర్వహించు కున్నారు. సర్పంచ్ కాక మునుపటి రోజుల నుంచే స్థానికంగా ఇతోధికంగా తనకు తోచిన రీతిలో సమాజ సేవలను అందిస్తున్న గుర్రాజు దంపతులు తమ వివాహ వేడుకను తునిలోని పెంటకోట వెళ్ళే రోడ్డులో 2006 స్థాపితమై మల్లీశ్వరి నిర్వహణలో కొనసాగుతున్న సాయి అన్నపూర్ణ అనాధ వృద్దుల ఆశ్రమంలో నిర్వహించు కున్నారు. భర్త మాట జవదాటని, భర్త అడుగు జాడల్లో నడిచే భార్య మల్లిక అనుమతి, సహకారంతో ఇద్దరు కుమార్తెలు దేవీఅక్షయ, స్ఫూర్తిలను వెంట బెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఈ దంపతులు ఇరువురూ వృద్దులకు పాదాబివందనం చేసి, వారి ఆశీర్వాదం పొందారు.
వృద్దులే స్వయంగా కేకును కట్ చేసి సర్పంచ్ దంపతులకు తినిపించారు. ఆ వృద్దుల సమక్షంలోనే వివాహ రోజు వేడుకలను సంతోషంగా జరుపు కున్నారు. అనంతరం వారికి 11 గంటల సమయంలో మధ్యాహ్న భోజనాన్ని ఆ సర్పంచ్ దంపతులు, పిల్లలూ స్వయంగా అందించారు. అంతే కాదు ఆ 80 మంది వృద్దులకూ దుప్పట్లను పంచి వారితో ” అన్నదాత సుఖీభవ ” అని వారి ఆశీర్వాదాలను అందుకున్నారు. ఒకానొక సమయంలో ఈ ఆశ్రమం వీధిలో ఓ ఇంటికి పరామర్శకు వెళ్ళినపుడు ఆ వృద్దుల దీన స్థితిని చూసి నా మనస్సు చలించిందని, అందుకు వారికి ఏదోక సాయం అందించాలని భావించి, తమ వివాహ వేడుకలను ఈ విధంగా జరుపు కున్నామని సర్పంచ్ సకురు గుర్రాజు ” విశ్వం వాయిస్ ” కు సాయంత్రం 7.7 గంటలకు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement