– వారం వారం లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
– కలెక్టర్ మాధవిలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
మండల స్థాయి అధికారులు వారి శాఖల పరిధిలో లక్ష్యాలను సాధించడానికి మరింతగా దృష్టి కేంద్రకరించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు.
సోమవారం గృహ నిర్మాణం, ఓటీఎస్, సచివాలయాల తనిఖీ, సమగ్ర డేటా సేకరణ, గ్రామ సచివాలయాలకు స్థల గుర్తింపు, ఆర్బికే లు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్‌లు, మధ్య ఆదాయ వర్గాల ఇళ్ల కోసం భూముల గుర్తింపు, జలజీవన్ మిషన్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం పై జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్, తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాగా, మునిసిపల్ కమిషనర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు విసి ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, మండల ప్రత్యేక అధికారులు, సచివాలయ ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా సచివాలయలను తనిఖీ చెయ్యాల్సి ఉందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు తనిఖీలు చెయ్యని సచివాలయాలు 123 ఉన్నాయన్నారు. వెంటనే ఆన్లైన్ రిపోర్ట్ లో ఇప్పటి వరకు తనిఖీలు చేపట్టని సచివాలయలను సందర్శించి నివేదిక అప్లోడ్ చేయాలన్నారు. సచివాలయాలకు సంబంధించిన ప్రతి రికార్డు ను నవీకరణ చెయ్యడం పై ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రజా ప్రతినిదులు రానున్న రోజుల్లో తనిఖీలు చేపట్టెలోగా అక్కడ పెండింగులో ఉన్న అంశాల పరిష్కారం చూపించే ప్రయత్నం చేయాలని మాధవీలత తెలిపారు.
జగనన్న లే అవుట్ లలో గుర్తించిన పెద్ద లే అవుట్ లుగా 17 ఉన్నాయని, వాటిలో 300 పైగా స్థలాలు ఉన్నట్లు తెలిపారు. ఆయా కాలనీల్లో ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బేస్ మెంట్ లెవల్ నుంచి రూఫ్ లెవల్, రూఫ్ నుంచి స్లాబ్ వరకు ఉన్న ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయడం ద్వారా లబ్దిదారుల ఖాతాకు ప్రభుత్వం నుంచి నగదు బదలీ కావడం ద్వారా తదుపరి ప్రగతి సాధించగలమన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్ని బి పి ఎల్ కుటుంబాలకి బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉందో డేటా మొత్తం సేకరించి తదుపరి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఓ టి ఎస్ కి సంబంధించి ఆర్డీవో లు పూర్తి భాధ్యత చేపట్టాలన్నారు. డాక్యుమెంటేషన్ పూర్తి అయిన వాటి రిజిస్ట్రేషన్ పత్రాలు ప్రింటింగ్ చేసిన వాటిని లబ్దిదారులకు అందచెయ్యలన్నారు. ఓ టి ఎస్ లో భాగంగా లబ్దిదారుల నుంచి వసూలు చెయ్యవలసిన మొత్తలు వసూలు చేసేందుకు వి ఆర్ వో లకి లక్ష్యాలను ఇవ్వాలన్నారు. ఇంకా మండలాల పరిధిలో లబ్దిదారుల కు స్థలాలు కేటాయించడానికి లబ్దిదారులు ఉంటే అనువైన స్థలం గుర్తించవలసి ఉందన్నారు. జలజీవన్ మిషన్ కింద జగనన్న కాలనీల్లో బోర్ల ఏర్పాటు కై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు త్రాగునీరు, సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు పై అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా అడుగులు వేయ్యాలన్నారు. ఉపాధి హామీ పథకం అమలు పై ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలు తూ.ఛా. తప్పకుండా పాటించాలన్నారు. ఇప్పటికే ఏదైనా సచివాలయానికి నోడల్ అధికారిని నియమించనట్లైతే తక్షణం నియమించి, వివరాలు అప్లోడ్ చేసి, తనిఖీలు చేపట్టాలన్నారు.
జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతి అర్భికే పరిధిలో కనీసం 3 వేల ఖాళీ గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్నారు. ప్రతి అర్భికే ను మండల అధికారులు తనిఖీ చేసి, అందుబాటులో ఉన్న గన్ని బ్యాగుల పై నివేదిక ఇవ్వాలన్నారు. రానున్న రెండు రోజులు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కోతలు కోసిన పంటను మిల్లులకు తరలించాలని, వర్షా నికి తడవకుండా రైతుల వద్ద టార్పలిన్స్ అందు బాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవడం ముఖ్యం అన్నారు. ఇప్పటికీ కోతలు కొయ్యని పంట ఉంటే గుర్తించి, రైతులకు తగిన సూచనలు చెయ్యాలని ఆదేశించారు. ప్రతి ధాన్యం బస్తా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులకు తెలిపి, అర్భికే కి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సర్వే అధికారి పి. లక్ష్మణ రావు, పిఆర్ ఎస్ ఈ ఏ బి వి ప్రసాద్, హౌసింగ్ అధికారి బీ. తారచంద్, సి పి ఓ పి. రాము, సాంఘిక సంక్షేమ అధికారి ఐ. నాగమణి, వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవో ఎస్. మల్లిబాబు, ఏ.చైత్రవర్షిణి, మండలాల నుంచి తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇంజినీరింగ్, వ్యవసాయ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.