– గ్రాంట్లు పొందగలం
– కమిషనర్ కె. దినేష్ కుమార్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
నగర పాలక సంస్థ పరిధిలో మురుగు నీరుపారుదల వ్యవస్థ కు శాశ్వత పరిష్కారం చూపెందుకు కృషి చేయాలని కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగరంలో ముగురు నీరు మళ్ళించే పలు కాలువల తీరును , ప్రవహించే మార్గాలలో అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం జిల్లాలో ఉన్న ఏకైన కార్పొరేషన్ అని, నగరానికి దగ్గరలో మధురపూడి విమానాశ్రయం ఉండడంతో ప్రతి నిత్యం పలువురు ప్రజా ప్రతినిధులు నగరం మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతోందన్నారు. జిల్లాకు తలమానికంగా నగరాన్ని అభివృధి చేయాల్సిన బాధ్యతమనపైఉందన్నారు. మురుగునీరు వ్యవస్థ ని నియంత్రించ ద్వారా పరిశుభ్రత కి ప్రతీకగా నిలిచే అవకాశం ఆ దిశలో ఇప్పటికీ అమృత్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు మరింత వేగవంతం చెయ్యాల్సి ఉందని దినేష్ కుమార్ పేర్కొన్నారు. అమృత్ పథకంలో భాగంగా నగర పాలక సంస్థ కి రావలసిన నిధుల కోసం ప్రతిపాదనలను సిద్దం చెయ్యాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్యం కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మరిన్ని గ్రాంట్లు పొందగలం అని దినేష్ కుమార్ తెలిపారు. అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని అందిపుచ్చు కోవాలని
తెలియ చేశారు. శనివారం రోజున బొమ్మురు, మోరంపుడి, ఎస్ టి ఆవా ఛానల్ లో పర్యటించిన కమిషనర్ నగరంలోని మురుగునీరు వ్యవస్థ ప్రవహించే మార్గాలపై ఒక స్పష్టమైన అవగాహన కి రావడం జరిగిందని అధికారులు వివరించారు. సోమవారం పర్యటనలో నల్ల చెరువు, కోటగుమ్మం శివుని బొమ్మ, బి ఈ డి ట్రైనింగ్ కాలేజీ, రాతి ఛానల్, ఎన్. ఆర్. ఈ, పంపు హౌస్, నాగేశ్వర రావు పార్కు, రైల్వే అండర్బ్రిడ్జి (ఆర్ యూ బి) , ఆల్కాట్
గార్డెన్, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటన లో ఈ ఈ వై ఎస్ ఎస్ నరసింహ రావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.