Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష గర్భిణీలకు రక్షా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* హైరిస్క్ పట్ల అప్రమత్తతే ప్రాణ రక్షణ
* 29 మంది గర్భిణీ స్త్రీలకు పరీక్షలు
* 13 మందికి హైరిస్కుగా గుర్తిపు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, మే 9 (విశ్వం వాయిస్ న్యూస్) ;

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంవత్సరానికి 365 రోజులూ అంటే నిరంతరం గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలను అందిస్తున్నారు. కాకుండా ప్రతీ నెలా 9 వ తేదీ రోజున పూర్తి సమయం కేటాయించి ప్రత్యేక శ్రద్దతో ప్రతీ ఒక్కరినీ కొద్ది సమయం పాటు నఖ శిక పర్యంతం సమస్తం పరీక్షించి వైద్యం, మందులు అదించడం, జాగ్రత్తలు, సలహాలు, సూచనలూ చెప్పడం, ఇంటి దగ్గర గర్భిణీలను జాగ్రత్తగా చూసుకునేలా, పోషక ఆహారం తీసుకునేలా చేయడం, తల్లీ బిడ్డల ఆరోగ్య సంరక్షణ, ఐదేళ్ళ లోపు మాతా శిశు మరణాల నివారణా లక్ష్యం పరిపూర్తికి ఏఎన్ఎంలు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలను సమన్వయం చేస్తూ అప్రమత్తం చేయడం ప్రధాన మంత్రి మాతృత్వ సురక్షా అభియాన్ పథకం లక్ష్యం. ఈ లక్ష్యాన్ని తు.చ. తప్పకుంబా పాటిండంలో సాటి లేని మేటి స్థానం శంఖవరం ప్రభుత్వ ఆస్పత్రిది.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరంలో ఊరికి కాస్త దూరంగా ఉన్నా ఈ ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీలకు రోజు వారీ, నెల వారీ సంతృప్తికరమైన వైద్య పరీక్షలు, సేవలు అందిస్తున్నారు. సేవలను అందించడంలో ఏ సేవా లోపం ఇక్కడ కనిపించదు. అటువంటి ఏ లోపం ఇప్పటికి ఇక్కడ బహిర్గతం కాలేదు. ఈ ఆస్పత్రి ప్రధాన వైద్యులు ఆర్వీవీ సత్యనారాయణ ఆదేశాలతో ఒక రోజు ముందుగా అంటే 8 వ తేదీకే ఆస్పత్రి పీహెచ్ఎన్, సీహెచ్ఓ ల ద్వారా ఆశా కార్యకర్తలకు నోటి మాట సూచనలు అందుతాయి. 9 తేది ఉదయం 9 గంటలకే గర్భిణీ స్త్రీలను వారి ఎంసీపీ, ఆరోగ్యశ్రీ, ఆధార్ కార్డులతో పాటు ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిక్షలను చేయించు కుంటే ఆ దస్త్రాలతో సహా ఆస్పత్రికి తీసుకు రావాలని అప్రమత్తం చేస్తారు.

ఆస్పత్రికి వచ్చిన గర్భీణీ స్త్రీలను పరిశుభ్రమైన, ప్రశాంత వాతావరణంలో కూర్చోబెట్టి తొలుత వారికి మాత్రమే చల్లని తీపి పానీయం అందించి కాస్త సేదతీర్చి ఉపశమనం కల్పిస్తారు. అనంతరం ఒక్కొక్కరికీ విడివిడిగా ఓ ప్రత్యేక గదిలో ఏకాంతంగా వారి ఆశ కార్యకర్తల సమక్షంలో రక్త, బీపీ, గుండె, షుగర్, హెచ్ఐవి, వీడీఆర్ఎల్, గర్భస్త శిశువు ఆరోగ్యం, వయస్సు నిర్ధారణ, గర్భిణీ స్త్రీల బరువు, హై రిస్క్ తదితర వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో మొదటి సారి రెండో సారి, మూడో సారి, నాలుగు అంతకన్న ఎక్కువ సార్లు గర్భం ధరించిన వారిని, హైరిస్క్ ఉన్న వారిని గుర్తిస్తున్నారు. అనంతరం గర్బిణీ స్త్రీలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిఆరోగ్య విద్య, ఆహార నియమాలూ, హైరిస్క్ గర్భీలకు ప్రత్యేక జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండటం, ప్రసవ జాగ్రత్తలను సంపూర్ణంగా వివరిస్తున్నారు.

శంఖవరం ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న పరీక్షలకు అదనంగా అవసరమైన పరీక్షల నిమిత్తం 12 కిలో మీటర్ల దూరంలోని రౌతులపుడిలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు, వైద్య సేవలనూ అందిస్తూ ఉన్నారు. అలాగే గర్భీణీల్లో హైరిస్క్ పట్ల అప్రమత్తతే ప్రాణ రక్షణ అని, గర్భిణీలు నిర్దిష్ట పరిమాణంలో రోజూ అవసరమైనన్ని సార్లు సంపూర్ణ పోషకాహారం, నీటిని సమృద్ధిగా తీసుకునేలా సిబ్బంది పర్యవేక్షించాలని, క్షేత్ర స్థాయిలో కూడా ఇళ్ళ దగ్గరే గర్భిణులకు నిత్యం మెరుగైన గృహ వైద్య సేవలను ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందించాలని మండల ప్రధాన వైద్యులు ఆర్వీవీ సత్యనారాయణ, ఆస్పత్రి వైద్యులు బాలాజీ, గోదాదేవి ఆదేశిస్తున్నారు.

2021 సెప్టంబర్ మాసంలో వైద్యురాలు, చంటి పిల్లల ప్రత్యేక వైద్య నిపుణురాలు గోదాదేవి ఇక్కడ విధుల్లో చేరడంతో మహిళల వైద్య విధానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. పురుష వైద్యులను కాదనీ ఎనిమిది నెలల కాలంగా గోదాదేవి గర్భిణీ స్త్రీలకు తానే ఓ మాతృ మూర్తిలా ప్రత్యేక శ్రద్దతో సేవలను అందిస్తూ ఉన్నారు. మహిళలు తమ గుప్త రోగాల గురించి సైతం స్వేచ్ఛగా, ధైర్యంగా చెప్పుకో గలుగు తున్నారు. వైద్యులు ఆర్వీవీ సత్యనారాయణ, బాలాజీ తర్వాత వారితో సమానంగా వారి వారసత్వంగా వారిలానే రోగుల మనసు చూరగొని గోదాదేవి మంచి పేరును సంపాదించు కున్నారు.

ఈ క్రమంలో సోమవారం వైద్యురాలు, చిన్న పిల్లల వైద్య నిపుణురాలు గోదాదేవి, అమృతవల్లీ సంయుక్తంగా 29 మంది గర్భీణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలను నిర్వహించారు. వీరిలో 13 మందికి హై రిస్కు సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ అరుణకుమారి, పీహెచ్ఎన్. కే.మేరీ, హెచ్.వీ. వీరలక్ష్మి, ఏ.ఎన్.ఎమ్ లు, గ్లోరీ, సూర్యకుమారి, సుగుణ, సూర్యకళ, ఎం.ఎల్.హెచ్.పీ. లిల్లీపుష్ప, ఆశాలు కోగూరి నాగమణి, జక్కల సూర్యకాంతం, జక్కల సునీత, పైడిపల్లి విజయ, కొంకిపూడి నూకరత్నం, గోవింలక్ష్మి, నూకరత్నంతో పాటు మరి కొందరు ఆశ కార్యకర్తలూ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement