Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చిత్తడి భూములుగా గ్రామ సమీప వరి సాగు భూములు.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గ్రామల వాడకం నీరు పారే డ్రైనేజిలు అభివృద్ధి
పరచాలి.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆపిలేశ్వరపురం:

 

కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్) గ్రామీణ ఉపాధి హామీ పథకం 40 శాతం కంపోనెంట్ నిధులు తో గ్రామీణ రహదారులు,డ్రైనేజీలు, కాంక్రీట్ తో అభివృధ్ది పరుస్తున్నారు.గ్రామాల్లో వాడకం నీరు సి. సి. డ్రెయినేజీ ల గుండా ప్రవహించి,సమీప పంట పొలాలు లోకి చేరుతోంది. మూడు దశాబ్దాలు క్రితం గ్రామాలలో వానా కాలంలో మాత్రమే కచ్చా డ్రైనేజీలు త్రవ్వేవారు. వాడకం నీరు అయితే ఎక్కడనీరు అక్కడే భూమి లోకి ఇంకి పోయేది. దాని వలన భూగర్భ జలాల పెరిగేవి. ఆ కాలంలో ప్రజలు తల స్నానానికి కొంకిడి కాయలు, సబ్బులకు బదులుగా శనగపిండి నలుగు, ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలు వంటి సహజ సిద్ధమైన వనరులు ఉపయోగించేవారు. అటువంటి వాడకం నీరు సాగు చేలల్లోకి ప్రవహించిన సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడేది. ప్రస్తుతం ప్రజలు తల స్నానానికి షాంపూలు, పళ్ళు తోముకోవాడానికి పేస్ట్ లు, స్నానానికి సబ్బులు, బట్టలు ఉతికే0దుకు డిటర్జెంట్ సబ్బులు వాడకం అధికమైంది. అటువంటి వాడకం నీరు వ్యవసాయ చేలలోకి ప్రవహించడం ద్వారా చిత్తడి నేలలు గా తయారయి పంటలు దెబ్బతి0టున్నాయి. దీనికి తోడు గ్రామంలో ప్రజలు వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు డ్రెయినేజీ ల గుండా వరి సాగు భూములు లోకి చేరి రైతులు చేలో కాలు పెట్టలేని పరిస్థితి దాపురించింది.ప్రభుత్వం మధ్యం విక్రయ దుకాణాల వద్ద తాగుడు నిషేధించింది.దీ0తో మధ్యం ప్రియులు పొలాలు, కాలువలు గట్ల పై మధ్యం తాగి,అనంతరం ప్లాస్టిక్ కవర్లు,గ్లాసులు, బీర్ సీసాలు, మధ్యం సీసాలు, అక్కడే పడవేస్తున్నారు. చేలలోకి దిగే రైతులకు బీర్ సీసా పెంకులు గుచ్చుకొని గాయాలు పాలయిన సంఘటనలు జరిగాయి. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ వాడకం నీరు ప్రవహించే మైనర్ డ్రైన్ గుర్రపు డెక్క తో మూసుకొని పోయింది. కావున మురుగు నీరు వెళ్లే దారి లేక వరి సాగు భూముల్లోకి చేరి సుమారు 40 ఎకరాలు సాగు భూమి చిత్తడి నేలలు గా తయారయినాయి. గత 10సంవత్సరాలు నుండి గ్రామ సమీప0లోని ఆ 40 ఎకరాలు వరి సాగు భూమి నిరుపయోగంగా పడివుంది. ఆ మైనర్ డ్రెయినేజీ ని మూడు సంవత్సరాలు క్రితం సిమెంట్ డ్రైన్ గా మూడు కోట్ల రూపాయలు తో అభివృధ్ది పరుచుటకు పనులు ప్రారంభించారు. కారణం ఏంటో తెలీదు పనులు మధ్యలో ఆపేసి నిధులు దారి మళ్లించారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే గ్రామ మురుగు నీరు తో వరి దిగుబడులు తగ్గి పెట్టుబడులు రాకపోవడం తో జగనన్న కాలనీ కి, ఇండ్ల స్థలాలు కు భూమిని లే అవుట్ లు చేస్తున్నారు.గ్రామాలలో మురుగు నీరు తోడ్కెల్లే డ్రైనేజీలు సిమెంట్ డ్రైన్ లుగా అభివృద్ది పరచాలని , లేకుంటే ఆ మురుగు నీరు వరి చేలలోకి చేరి ప్రతి యేటా చిత్తడి నేలలు పెరుగుతాయని రైతులు ఆందోళన చెందుచున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement