అందజేస్తున్న చిర్ల
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు (విశ్వం వాయిస్ న్యూస్) మండలం పరిధిలో చెముడులంక గ్రామంలో శ్రమ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చెముడులంక గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం నాడు ఆవులు, మేకలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ మనుషుల్లో స్వార్ధం పెరిగిపోతున్న ఈరోజుల్లో పక్క వాళ్ళ కోసం సమయాన్ని, ధనాన్ని కేటాయిస్తూ చెముడులంక గ్రామంలోని ఎస్సీ వర్గాల కుటుంబాల సాధికారత కోసం శ్రమ స్వచ్ఛంద సేవా సంస్థ ఆలమూరు కార్యనిర్వాహక కార్యదర్శి శేషు, నిర్వాహకులు గుర్రపు నరసింహమూర్తిలను అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ ద్వారా 17 కుటుంబాలకు ఆవులు, 15 కుటుంబాలకు 30 మేకలు, ప్లాస్టిక్ ట్రే లు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా అందచేశారు. అలాగే ఈ సంస్థ నుండి 20 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, 25 మంది మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణా, యువతీ యువకులకు కంప్యూటర్ శిక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ రాష్ట్ర సేవాదల్ కార్యదర్శి చల్లా ప్రభాకర్ రావు, తమ్మన గోపి, అడబాల వీర్రాజు, దొండపాటి వీర వెంకట్రావు (చంటి), బుడ్డిగ వీర వెంకట్రావు ( మాజీ సర్పంచ్),దొండపాటి వెంకటేశ్వరరావు ( బుల్లి రెడ్డి), మోటూరు సురేష్, తమ్మన హరి, అడబాల వెంకట్రావు (ఉపసర్పంచ్) ,పాలూరి చిరంజీవి, బొణంరామకృష్ణ, గుర్రపు రత్నరాజు, తంగడిమిల్లి క్రాంతి కుమార్, గుర్రపు ఏడుకొండలు,నక్కా సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.