Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గడపగడపకి కార్యకర్తలకు పిలుపు. తోట మలుపు…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సంక్షేమ ప్రభుత్వం..
ప్రజల్లో వైఎస్సార్సీపి…
గడపగడపకి ప్రచారం…
పెద్ద ఎత్తున పాల్గొనాలని తోట పిలుపు…

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

మండపేట:- గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వ విజయాలను ప్రతి గడప కు తీసుకుని వెళ్లాలని మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. మండపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో చైర్మన్ పతివాడ నుక దుర్గ రాణి, వైఎస్సార్సీపీ నేత వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి ల సంయుక్త అధ్యక్షత న జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప కు కార్యక్రమంలో శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం ను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేసారు.మండపేట నియోజకవర్గంలో సమస్యలు గుర్తించి వాటిని పరిష్కారం కోసం కృషి చేస్తున్న వైనాన్ని వివరించాలని కోరారు. ముఖ్యంగా ద్వార పూడి రోడ్ అంశంలో టీడీపీ, జనసేన చేస్తున్న విమర్శలకు జవాబు ఇవ్వాలని పేర్కొన్నారు. టెండర్లు పూర్తి అయ్యాయని ఈ నెల లోనే ఆ రహదారి నిర్మాణం ఆరంభం అవుతుందన్నారు.ఇలా అన్ని అంశాలను ప్రజలకు నిశితంగా వివరించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని కోరారు.
2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 95శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు.  ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్దిదారుల ఖాతాలకు లక్షా 38వేల 894కోట్ల రుపాయల నగదు బదిలీ చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.  ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఇంటింటికి పార్టీ కార్యక్రమాలను పరిచయం చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో టౌన్ వైఎస్సార్సీపీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, వైఎస్సార్సీపీ నేతలు కర్రీ పాపా రాయుడు, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, నాయకులు పెంకే గంగాధర్, వార్డు కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement