ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కి ఏడురోచ్చి
స్వాగతం చెబుతున్న గ్రామస్తులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అనపర్తి:
అనపర్తి, విశ్వం వాయిస్ న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అతి తొందరగా బుధవారం ప్రారంభించాల్సి ఉన్న గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ముహూర్తం మేరకు ఒకరోజు ముందుగా నియోజకవర్గ కేంద్రమైన అనపర్తి శివారు కొత్తూరులో మంగళవారం శ్రీకారం చుట్టారు. సంబంధిత సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు వెంటరాగా గడపగడపకు వెళ్లిన ఎమ్మెల్యే ఆయా కుటుంబాలకు మూడేళ్ల కాలంలో చేసిన సంక్షేమ వివరాలను తెలియజేయడంతో పాటు లబ్ధిదారుల ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కారానికి సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో గ్రామం మొత్తం మీద ఒకటి లేదా రెండు కుటుంబాలకు తప్ప అర్హత కలిగిన మిగిలిన కుటుంబాలకు 50వేల నుండి లక్ష రూపాయల పైబడిన సంక్షేమ పథకాలు అందుతున్నట్లు స్వయంగా లబ్ధిదారులు చెబుతుండడం విశేషం. గ్రామ వాలంటీర్ ఆ కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాల లబ్ధి వివరిస్తున్న తరుణంలో లబ్ధిదారుల ముఖాల్లో సంక్షేమ వెలుగులు విరబూస్తున్నాయి. గ్రామస్తులు చెబుతున్న సమస్యలను నమోదు చేసుకుని తిరిగి మరొక పర్యాయం తాను ఆ గడపకు వచ్చే సమయంలో ఆ సమస్య పరిష్కరించి తీరాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమానికి వస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆయనకు ఎదురొచ్చి స్వాగతం చెబుతుండడం విశేషం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సిపి అనపర్తి టౌన్ అధ్యక్షులు రంగంపేట మండలం ఇంచార్జ్ నల్లమిల్లి మురళి మోహన బాలకృష్ణ రెడ్డి, అనపర్తి మండలం జడ్పిటిసి సత్తి గీతా వరలక్ష్మీ వెంకట రెడ్డి, అనపర్తి మండలం ఎంపీపీ అంసూరి సూర్యనారాయణ, అనపర్తి మండలం వైస్ ఎంపీపీ పులగం బుల్లి రెడ్డి , వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, అనపర్తి గ్రామ సర్పంచ్ శ్రీమతి వారా కుమారి, బిసి బట్ట రాజు కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చిట్టిరాజు, అనపర్తి మండలం వైస్ ఎంపీపీ2 కర్రీ ఏసుదాసు, కొత్తూరు సత్తి గంగిరెడ్డి, కొండేటి భీమేష్, కొత్తూరు సత్తి సుబ్బారెడ్డి, నల్లమిల్లి వెంకటరెడ్డి (సుమన్), పడాల కళ్యాణ్ రెడ్డి, సబ్బెళ్ళ నాగిరెడ్డి, కోణాల శ్రీనివాస్ రెడ్డి (గుంటూరు శ్రీను), పడాల వెంకటరెడ్డి మరియు వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.