విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:
ఆత్రేయపురం:విశ్వం వాయిస్ న్యూస్:అసాని తుఫాను ప్రభావంతో విపరీతంగా గాలులు వీచే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల శ్రద్ధ వహించాలని ఎంపీడీవో, తహసీల్దార్ అన్నారు. మంగళవారం గ్రామపంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసనీ తుఫాను పట్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలనీ, అందరూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలనీ, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలనీ ఆత్రేయపురం తాహశిల్దార్ ఎం రామకృష్ణ, ఎంపీడీఓ నాతి బుజ్జి అధికారులను ఆదేశించారు. ఆత్రేయపురం తాహశిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశం లో వారు మాట్లాడుతూ, రాబోయే రెండు రోజుల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉండొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో, ఎలక్ట్రిసిటీ సరఫరా కు ఆటంకం ఏర్పడినట్లయితే గ్రామ పంచాయతీ ల ద్వారా మంచి నీటి సరఫరాకు అవసరమైన జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలనీ,పారిశుధ్యం, ఆరోగ్యం, పశువుల భద్రత, కమ్యూనికేషన్ వ్యవస్థ తదితర అంశాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.. ఈ సమావేశం లో అన్ని శాఖల అధికారులు, వీఆర్వోలు, కార్యదర్శులు పాల్గొన్నారు.