అధికారిణి సోమిరెడ్డి లక్ష్మి లావణ్య
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు (విశ్వం వాయిస్ న్యూస్): అసని తుఫాను ప్రభావంతో రాబోయే రెండు,మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్నదాతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలమూరు వ్యవసాయ అధికారిణి సోమిరెడ్డి లక్ష్మీ లావణ్య సూచించారు. రైతులు వరికోతలను మూడు రోజుల వరకు వాయిదా వేసుకోవాలని ఆమె అన్నారు. ఇప్పటికే కోతలు పూర్తయి పంట చేతికి వచ్చిన రైతులు ధాన్యాన్ని టార్పాలిన్ లతో కప్పి ఉంచడం, ధాన్యం ఉంచిన చోట నీరు నిల్వ ఉండకుండా చూడటం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని అన్నదాతలను కోరారు. మండలంలో ఇప్పటివరకు 5225 ఎకరాల్లో వరికోతలు పూర్తయ్యాయని, 6550 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేలా ద్వారా కొనుగోలు చెయ్యడం జరిగిందని ఆమె అన్నారు.