Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అసమర్ద పాలనతో ప్రజలపై భారం, టిడిపి నేత బండారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆలమూరు: సమీవేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర టిడిపి
ఉపాధ్యాక్షులు బండారు సత్యానందరావు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్ ): ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనతో పేద ప్రజలపై పన్నుల భారం పడిందని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్ దేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కోనసీమ జిల్లా ఆలమూరులో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని బండారు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఆలమూరు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బండారు మాట్లాడుతూ విద్యుత్ సరిగ్గా ఇవ్వలేని ప్రభుత్వం ఏడుసార్లు చార్జీలను పెంచిందని విమర్శించారు. మద్యపానం నిషేధం అంటూ అధికారంలోకి వచ్చి జె బ్రాండ్స్ వంటి నాసిరకం మద్యాన్ని విక్రయిస్తు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువులతో పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఇటువంటి దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని అధికార ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆలమూరు మండలంలోని 18 గ్రామాల్లో బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పార్టీలో పనిచేసే ప్రతిఒక్కరికీ సభ్యత్వం తప్పనిసరిగా ఉండాలని, మీరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలి అలాగే ఎక్కువ మందిని సభ్యత్వాలు తీసుకొనేలా ప్రభావితం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బండారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సిద్ది రెడ్డి పెద్దకాపు, ఈదర నల్లబాబు, వక్కపట్ల లచ్చిబాబు క్లస్టర్, యూనిట్ ఇంఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఐటీడీపీ టీమ్, యువత పలువురు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement