Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

బీసి ఓట్లతో నగ్గిన ద్వారాంపూడికి మత్స్యకారులు అంటే చులకన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ఈ మూడేళ్లలో నాగరాభివృద్ధి ఎం చేశారో… ద్వారాంపూడి
చెప్పాలి
– నగర టిడిపి నాయకులు డిమాండ్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

ప్రతిపక్ష పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు దూషణలు చేయడం తప్ప నగర అభివృద్ధికి ఎమ్మెల్యే ద్వారంపూడి ఏం చేశారో చెప్పాలని నగర టీడీపీ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, కార్పొరేటర్ వొమ్మి బాలాజీలు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి తప్ప నేడు వైసిపి ప్రభుత్వంలో స్థానిక నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదన్నారు.
మూడున్నరేళ్లుగా ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న అవినీతిని కొండబాబు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, జగన్ మెప్పు కోసం పాకులాడడం తప్ప నగర అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు.
ఈ మూడేళ్ళ వైకాపా పాలనలో మున్సిపల్ కార్పొరేషన్ నిధులు వేల కోట్లు దుర్వినియోగం జరుగుతున్నాయని, గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన పనులను కొన్నాళ్లు బీసీ మంత్రులు చేత ప్రారంభోత్సవాలు చేయడం తప్పా ద్వారంపూడి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలపాలని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న అవినీతి అక్రమాలపై మాజీ శాసనసభ్యులు కొండబాబు చేసిన సవాలును స్వీకరించకుండా మత్స్యకారుల వృత్తిని కించపరిచే విధంగా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, మత్స్యకారులు కార్పొరేటర్లను పక్కన పెట్టుకుని మరీ కొండబాబు ఉప్పు చేపల వ్యాపారం తీసుకుంటాడని హేళన చేస్తున్నారన్నారు. మా నాయకుడు కొండబాబు నేను ఉప్పు చేపల వ్యాపారం చేసుకునే వాడినని నేటికీ సగర్వంగా చెప్పుకుంటారని, అక్రమ వ్యాపారాలతో దోచుకున్న సొమ్మంతా జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి నిధులను నగరానికి తీసుకు వచ్చారా అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి బీసీ ఓట్లుతో గెలిచి బీసీల పట్ల హేళనగా ప్రవర్తిస్తున్నారని గతంలో పూలే పేరును తొలగించి బిసిలను అవమానించారని వీరు, రమేష్ , బాలాజీలు వివరించారు.
ఈ సమావేశంలో గుజ్జు బాబు, బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement