Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

త్వరలో కేంద్ర గ్రంధాలయ నూతన భవనిర్మాణం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ స్థానిక జిల్లా కేంద్ర గ్రంధాలయానికి త్వరలో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు డాక్టర్ ఎం ఆర్ ప్రసన్న కుమార్ తెలిపారు.కాకినాడ లోని కేంద్ర గ్రంధాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంధాలయ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంధాలయం నూతన భవనం నిర్మించుటకు కృషి చేయవలెనని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు కోరారు . అలాగే చదవడం మాకు ఇష్టం కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులలో పుస్తక పఠనం అలవాటును పెంపొందించేలా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎం శేఖర్ బాబు , రాష్ట్ర వై ఎస్ ఆర్ సి పి కార్యదర్శి దూలం వెంకన్న బాబు , డిప్యూటీ లైబ్రేరియన్ ఆర్ ఆర్.వెంకటరాము , సీనియర్ అసిస్టెంట్ ఎల్ వెంకటేశ్వరరావు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి జయ కృష్ణ , సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement