Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,161,922
Total recovered
Updated on March 24, 2023 3:24 PM

ACTIVE

India
7,927
Total active cases
Updated on March 24, 2023 3:24 PM

DEATHS

India
530,818
Total deaths
Updated on March 24, 2023 3:24 PM

డబ్బు లేమిటో విద్య ఆగరాదనేది జగన్ లక్ష్యం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– సహాయ సంక్షేమధికారిణి ఎన్. రాజేశ్వరి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, మే 12, (విశ్వం వాయిస్ న్యూస్) ;

మఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బు లేమితో పేద కుటుంబాల్లో ఏ ఒక్క విద్యార్ధీ విద్య ఆగిపోకూడదు అనేది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం అని పెద్దాపురం రెవెన్యూ డివిజన్ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సహాయ సంక్షేమాధికారిణి ఎన్.రాజేశ్వరి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం స్థాయి జగనన్న విద్యా దీవెన నమూనా చెక్ పంపిణీ కార్యక్రమాన్ని మండల కేంద్రం శంఖవరంలోని మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించారు. ముందుగా భారతరత్న బీమారావ్ రాంజీ అంబేద్కర్ చిత్ర పటానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు, డివిజన్, నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా పూల మాలను వేసారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఫధకాలపై తెరఫై ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రదర్శించారు. అనంతరం సభాధ్యక్షురాలు ఎన్.రాజేశ్వరి లబ్దిదార మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. గత తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ గా కొనసాగిన ఈ పధకంలో సొమ్ములను లబ్దిదారులైన విద్యార్ధులకు సగం సగం మాత్రమే ఇచ్చి మిగతాది ఆపేసారని ఆమె గుర్తు చేసారు. అదే నేటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనగా కొనసాగుతున్న పధకాల్లో పూర్తి సొమ్ములను సకాలంలో చెల్లిస్తున్నారని ఆమె స్పష్టం చేసారు. జగన్ తను ఇచ్చిన మాటకే కట్టుబడి పధకాలను అమలు చేస్తున్నారని ఆమె పేర్కొఉన్నారు. ప్రభుత్వ పధకాలను అమలు చేయడంలో జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుంటే జగన్ మాత్రం పది అడుగులు ముందుకు ఉండి ముందుకు కొనసాగుతూ ఉన్నారని జగన్ కార్యదక్షతను ప్రశంసించారు. జగన్ ను మరింత ముందుకు తీసుకు వెళ్ళాలని కోరుతూ ఇటువంచి మంచి కార్యక్రమంలో మాట్లాడు తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని తన అనుభూతిని
పెద్దాపురం రెవెన్యూ డివిజన్ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సహాయ సంక్షేమ అధికారిణి ఎన్.రాజేశ్వరి తెలిపారు. ఏలేశ్వరం జడ్పీటీసీ సభ్యురాలు నీరుకొండ రామకుమారి, శంఖవరం, రౌతులపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల అథ్యక్షులు వరుసగా పర్వత రాజబాబు, గంటిమళ్ళ రాజ్యలక్ష్మి, గొల్ల కాంతిసుధాకర్, గొల్లపల్లి నరసింహ మూర్తి (బుజ్జి) మాట్లాడారు. అనంతరం 2020 -’21 విద్యా సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గం నాలుగు మండలాల్లోని 41,462 మంది విద్యార్ధులకు చెందిన 26,282 మంది తల్లుల బ్యాంకుల పొదుపు ఖాతాల్లో ఇఫ్పటికే ప్రభుత్వం జమ చేసిన సొమ్ములు 26 కోట్ల 53 లక్షల మొత్తానికి నమూనా చెక్ ను విద్యార్ధుల తల్లులకు ఎమ్మెల్యే పర్వత పంపిణీ చేసారు. ఏలేశ్వరం నగర పంచాయతీ మేయర్ అలమండ సత్యవతి, ఏఎస్డబ్ల్యుఓ సత్యనారాయణ, శంఖవరం, రౌతులపూడి, ప్రత్తిపాడు ఎంపీడీవోలు జాగారపు రాంబాబు, ఎం.గోవిందు, ప్రభుత్వ వసతి గృహాల సంక్షేమాధికారులు ఆర్.ఎం.ఎస్.టీ.వర్మ, గంటిమళ్ళ అప్పారావు, కె.సుందరమ్మ, పి.సత్యనారాయణ, సూర్యకుమారి, డి.విజయకుమార్, కె.రాఘవమ్మ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!