విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
అమరావతి, విశ్వం వాయిస్ః
నూతనంగా జిల్లాగా ఏర్పడిన తరువాత తొలిసారిగా కోనసీమలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు ఈనెల 13న ఐ.పోలవరం మండలం మురమళ్ళలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు అందజేయనున్నారు. రాష్ట్రంలో లక్ష 19 వేల మంది లబ్ధిదారులకు మత్స్యకార భరోసా పథకం కింద లబ్ధి చేకూరనుంది. ఓఎన్‌జీసీ మత్స్యకారులకు అందిస్తున్న నష్టపరిహారం 108 కోట్ల రూపాయలు కూడా ఇదే వేదికపై నుండి సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారులకు అందజేయనున్నారు. దీంతోపాటు ముమ్మిడివరం నియోజకవర్గంలో మూడు ప్రధానమైన వంతెనలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు కాన్వాయ్ ట్రైల్ రన్ కూడా నిర్వహించారు.
*షెడ్యూల్:*
►శుక్రవారం ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు ఐ పోలవరం మండలం కొమరగిరి చేరుకుంటారు.
►10.45 గంటలకు మురమళ్ళ వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.నెల