విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం ( విశ్వం వాయిస్ )
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఉప్పలగుప్తం మండలం ఎన్ కొత్తపల్లి గ్రామంలో నల్ల వారి పేట నుండి రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ అట్టహాసంగా ప్రారంభించారు. ఆయనకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గ్రమంలో గడపగడపకు వెళ్లి ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాల వివరాలు, ఆ కుటుంబం యొక్క యోగక్షేమాలు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఇంటి వద్ద మంత్రికి చిరునవ్వుతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటి వద్ద ఆ కుటుంబ సభ్యులతో మమేకమై మంత్రి ఆత్మీయంగా పలకరించారు. ప్రతి గడప వద్ద మీరు మా ఇంటికి రావడం… మా సమస్యలు తెలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామని, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు ప్రజలు నీరాజనాలు పలికారు. ప్రతి ఇంటి వద్ద వాలంటీర్లు, అధికారుల సమక్షంలో ఆ ఇంటికి సంబంధించిన సమస్యలు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అడిగి తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు చూపారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు తమకు అందుతున్న సంక్షేమ ఫలాలను మంత్రికి తెలిపి, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో మహిళలు వృద్ధులు ఆత్మీయ పలకరింపులకు మంత్రి పులకించిపోయారు. తన ఇంట్లో అమ్మబడి, వైయస్సార్ ఆసరా చేయూత, సామాజిక భద్రత పింఛన్లు తదితర పథకాలు అందుతున్నాయని, జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని మంత్రి ఎదుట మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎండిఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.