రామచంద్రపురం డిఎస్పీ బాలచంద్రారెడ్డి, మండపేట
రూరల్ సిఐ శివ గణేష్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు (విశ్వం వాయిస్ న్యూస్): తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన ఆలమూరు మండలం పెనికేరులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెనికేరు గ్రామానికి చెందిన చిలుకూరు వీర సుబ్బారాయుడు తన భార్య పిల్లలతో కలసి ఈ నెల 7న అత్తఇంటికి నల్లజర్ల వెళ్లారు. తిరిగి బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి కనిపించాయి. ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. బీరువాలోని 30 కాసుల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి, మండపేట రూరల్ సిఐ శివ గణేష్, ఆలమూరు ఎస్సై శివ ప్రసాద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ నుంచి క్లూస్ టీం ను రప్పించి వేలిముద్రలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేసి రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరం చేశారు._