సక్రమంగా అందుతున్నాయా లేదా తెలుసుకునే
కార్యక్రమమే గడపగడపకు మన ప్రభుత్వం…
ఎమ్మెల్సి తోట త్రిమూర్తులు…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: ఓట్ల కోసం అడగడానికి గడప గడపకు మన ప్రభుత్వం కాదు, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకునే కార్యక్రమమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉద్దేశమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
మండలంలో వి. సావరం గ్రామంలో సర్పంచ్ కాకి కృష్ణ వేణి కోటేశ్వరరావు అధ్యక్షతన గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు ప్రతి గడప గడప కు తిరుగుతూ ఆ కుటుంబంలో ఏఏ పథకాలలో ఎంతెంత లబ్ది ప్రభుత్వం నుండి పొందినారో వారికి వివరించి ఇంకనూ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అడిగి తెలుసుకున్నారు. సంబంధిత సమస్యల పై సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్ల తో చర్చించి వెంటనే వాటిపై తగు చర్యలు తీసుకుని నేరుగా లబ్ధిదారులకు తెలియచేయాలని అధికారుల నుండి ఏ విధమైన స్పందన రానట్లయితే తనను వచ్చి స్వయంగా కలవాలని తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో ఇప్పటికే 95 శాతం అమలయ్యాయనీ ప్రజల దృష్టికి తీసుకు వచ్చారు. తొలుతగా గ్రామంలో ఉన్న ఆలయాలను ఎమ్మెల్సీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ నాయకులు, మండల అధికారులు, గ్రామ వాలంటరీలు, సచివాలయ సిబ్బందితో గడపగడపకు తిరిగి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నవరత్నాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సత్తి పెద్దకాపు వీదిలో మురుగు నీరు పోవుటకు డ్రైనేజీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఏ నాయకుడు వచ్చినా మా గ్రామాన్ని పట్టించుకునే నాధుడు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మా గ్రామానికి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే నాలుగు సార్లు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. కానీ మా సమస్య పరిష్కారానికి ఎవరు కూడా ముందుకు రాలేదని మీరైనా మా బాధలను అర్థం చేసుకుని మా మాకు సత్వరమే డ్రైనేజి ఏర్పాటు చేసి మాకు మేలు చేయాలని మహిళలు ఎమ్మెల్సీ తోట దృష్టికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న తోట స్పందించి పంచాయతీ అధికారులను త్వరలోనే గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి ఏ గోవిందు రాజులకు ఆదేశించారు. ఈ సందర్భంగా తోట మహిళలతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాటలతో మిమ్మలను నమ్మించి మోసం చేశారని, కానీ మా వైయస్సార్ సిపి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని, అతి త్వరలోనే గ్రామంలో ప్రధాన సమస్య గా వున్న డ్రైనేజీ నిర్మించిన తర్వాత మరల మీ దగ్గరకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు వెయ్యమని అడుగుతానని అన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రజక కమ్యూనిటీ హాల్ పై అంతస్తు ఎమ్మెల్సీ తోట చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి సి కోనసీమ జిల్లా రైస్ మిల్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాజబాబు, కొవ్వూరు త్రినాద్ రెడ్డి, కామత్ కర్రీ పాపారాయుడు, జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు చిన్న కాపు, ఎంపీపీ నౌడు వెంకటరమణ, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సిరిపురపు శ్రీనివాస రావు, మండల కన్వీనర్ అపర్ణ పుల్లేష్, తాసిల్దార్ కె జే ప్రకాష్ బాబు, మండల ప్రజా పరిషత్ పరిపాలన అధికారి ఎం హరికృష్ణ రెడ్డి, గ్రామ వైస్ ప్రెసిడెంట్ వెలగల సత్యనారాయణ రెడ్డి, నియోజకవర్గం నుండి ఆయా మండల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, గ్రామ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.