Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కౌలు రైతులను ఆదుకోవాలి.. జిల్లా కౌలు రైతు సంఘం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

# తడిసిన దాన్యాన్ని కొనుగోలు చేయాలి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుమంట్ర:

పెనుమంట్ర, (విశ్వంవాయిస్ ప్రతినిధి)

అసని తుఫాన్ వలన కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యం రాశుల కళ్ళాల్లో ధాన్యం మొలకెత్తిందని ఎకరాకు ఐదు బస్తాలు పైబడి నష్టం వుంటుందని మార్కెట్ ధరప్రకారం ఏడు వేల రూపాయలనుండి పది వేల రూపాయల వరకు కౌలు రైతులకు నష్టం వుంటుందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం పశ్చమగోదావరి జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు తెలియజేశారు.కౌలు రైతుల సంఘం ఆద్వర్యంలో శుక్రవారం పెనుమంట్ర మండలంలోని పెనుమంట్ర, బ్రహ్మణచెరువు, భట్ట్లమగుటూరు, ఆలమూరు గ్రామాల్లో పర్యటించి *మొలకెత్తిన ధాన్యాన్ని కౌలురైతుల సంఘం నాయకులు* పరిశీలించారు.ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు కేతాగోపాలన్ మాట్లాడుతూ. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కౌలు రైతులు ధాన్యాన్ని అయిన కాడకి అమ్ముకుంటున్నారని, కనీసం వారు ధాన్యం అమ్ముకుందామన్న ప్రభుత్వ నిబంధనల వలన రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం అమ్మే పరిస్థితిలేదన్నారు.దీనికి తోడు రైతు భరోసా కేంద్రాలు పట్టించుకోక పోవటంతోనూ, వర్షాబావ పరిస్థితులను ఆసరా చేసుకొని బ్రోకర్లు ధాన్యం తక్కవ రేటుకి కొని అయిన కాడకు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి తేమశాతంతో సంబందం లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు జోగి చినకొండ,బొక్కా వెంటేశులు,కుక్కల శంకరుడు, కవురు నవీన్,కవురు లక్ష్మి, పెచ్చెట్టి సత్యనారాయణ,తాడి శ్రీనివాసు పాల్గోన్నొరు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement