Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రైతుల సంక్షేమ పధకాలు సద్వినియోగం చేసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

# సేంద్రియ పద్దతి మేలు
# పొలాల్లో గడ్డి తాగాలబెట్టవద్దు
# జూన్ మొదటి వారంలో నీటి విడుదల

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుమంట్ర:

పెనుమంట్ర (విశ్వంవాయిస్ ప్రతినిధి)
రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించేలా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరారు.శుక్రవారం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం కొవ్వూరి రామకృష్ణ సూర్యనారాయణ రెడ్డి(చిన్నారెడ్డి) అధ్యక్షతన మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ నిర్వహించారు.జడ్పీటీసీ కర్రీ గౌరీ సుభాషిణి మాట్లాడుతూ గత సార్వా,దాళ్వా సీజన్ల యందు దిగుబడులు తక్కువగా నమోదు అయిందని, దీనికి గల కారణాలను అన్వేషించి దిగుబడులు పెరిగే విధంగా ప్రణాళికలు తయారు చేసి రాబోయే పంటల కాలంలో మంచి అధిక దిగుబడులు వచ్చేలా చూడాలని,ఎరువులు తక్కువగా వాడేలా చూడాలని కోరారు.మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కర్రీ వెంకట నారాయణ రెడ్డి(వాసు రెడ్డి) మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా, సున్నా వడ్డీ పథకం,ఉచిత పంటల బీమా పథకం వంటి బృహత్తర సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని,ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందేలా చూడాలని వ్యవసాయ సిబ్బందిని కోరారు. నీటిపారుదల శాఖ ఏఈ జయశంకర్ మాట్లాడుతూ అధికారుల సమాచారం ప్రకారం జూన్ మొదటి వారంలోనే కాలువలు వదులుతారని,దీనికి అనుగుణంగా వ్యవసాయ సిబ్బంది జూన్ మొదటి వారం నుంచే నారుమడులు వేసే విధంగా రైతన్నలను సిద్ధం చేయాలని సూచించారు.మండల వ్యవసాయ శాఖ అధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పంట కోసిన తర్వాత రైతులు ఎవరూ కూడా గడ్డి తగలబెట్టవద్దని,దీనివల్ల భూమిపై పొరల్లో ఉండి మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోవడమే కాకుండా కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులు విడుదల అవుతాయని,భూమి బీడు బారుతుందని తెలుపుతూ, అధికారుల సూచనల మేరకు గడ్డి తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు రైతులకు తెలపాలన్నారు. వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు కొవ్వూరి చిన్నారెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా రైతు భరోసా కేంద్రం సిబ్బంది చూడాలని,ఈ మధ్య కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు కొద్దిగా నష్టపోయారని,వారి వద్ద ఉన్న రంగుమారిన ధాన్యాన్ని ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సమావేశంలో మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులు,పశువుల శాఖ వైద్యాధికారిణి వరలక్ష్మి,ఇరిగేషన్,సచివాలయ,వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement