వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల
నాగేశ్వరావు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్ ): కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణంలో మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల నాగేశ్వరావు అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రబీ సాగు ప్రణాళిక సమగ్ర పంట రక్షణ యాజమాన్య పద్ధతుల గూర్చి సమావేశంలో వివరించారు.రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు రబీ సీజన్ 2022లో రైతులందరూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సద్వినియోగం చేసుకోవడం వల్ల సరైన గిట్టుబాటు ధర అందుతుందని తెలియజేశారు .అదేవిధంగా వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్ కె.వి చౌదరి,మండల వ్యవసాయ అధికారిని ఎస్.లక్ష్మీ లావణ్యలు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రం లో రైతులకు మినుములు,పెసర విత్తనాలకు సబ్సిడీపై అందింస్తున్నట్లు వారు తెలిపారు. కావలసిన రైతులు గ్రామస్థాయిలో ఉండే ఆర్‌బీకేల్లో విత్తనాలు తీసుకోవాలని కోరారు.అన్ని రైతు భరోసా కేంద్రంలోని ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే రైతు భరోసా లబ్ధిదారుల లిస్టు నోటీస్ బోర్డ్ లో పెట్టామని ఈ నెల 16వ తారీఖున రైతులందరికీ తమతమ ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేయబడతాయి అని తెలియజేశారు.అదేవిధంగా రైతులు మాట్లాడుతూ వర్షం వచ్చినప్పుడు ధాన్యం పై కప్పుకోవడానికి టార్పాలిన్ కావాలని,వర్షం నీరు పోయేందుకు డ్రైనేజీ వ్యవస్థ అనువుగా ఉండాలని వారి సమస్యలను తెలియజేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి సభ్యులు సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.