Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 12, 2024 8:12 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 12, 2024 8:12 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 12, 2024 8:12 PM
Follow Us

రావులపాలెం గ్రామ దేవత ఆకులమ్మ వారి మహోత్సవములు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

 

రావులపాలెం(విశ్వం వాయిస్) రావులపాలెం గ్రామ దేవత శ్రీ ఆకులమ్మ అమ్మ వారి జాతర మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 15వ తేదీన జాతర, 16వ తేదీన తీర్థ మహోత్సవాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేసామని ఆలయ కమిటీ చైర్మన్, గ్రామ ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి తెలిపారు. స్థానిక మార్కెట్ రోడ్డులో ఉన్న అమ్మ వారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రధాన అర్చకులు మాగాపు బ్రహ్మేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గత నెల 29వ అమ్మ వారిని తీసుకు వచ్చి ఈనెల 14వ తేదీ వరకు గరగ రూపంలో గ్రామంలో ఊరేగించారు. 7,8,9 తేదీల్లో అమ్మ వారి చల్లఘటం ఊరేగింపు నిర్వహించారు. ఈనెల 15వ తేదీన గ్రామ దేవత ఆకులమ్మ వారిని ఇళ్ళకు తీసుకుని వెళ్లి చీర, జాకెట్టు పెట్టి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. పసుపు కుంకుమలతో భక్తులు కలశాభిషేకం నిర్వహిస్తారు. రాత్రికి బాణాసంచా కాల్పులు, గరగలు, తీన్ మార్ డప్పులు, కేరళ డప్పులు, అమ్మ వారి వేషధారణలతో అమ్మ వారి జాతర, ఊరేగింపు జరుగుతుంది. 16వ తేదీ సోమవారం సాయంత్రం వరకు తీర్థం నిర్వహిస్తారు. రావులపాలెం గ్రామస్తులు వేలాది గా తరలి వచ్చి అమ్మ వారిని దర్శించుకుంటారు. చిన్నారులతో దివిటీలు కొట్టించి మొక్కులు తీర్చుకుంటారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement