* 12155 మంది రైతులకు రూ.6707.525 లక్షలు జమ
కలెక్టర్ డా. కె. మాధవీలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహంద్రవరం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్: వైఎస్సార్ రైతు భరోసా నాలుగో విడత మొదటి దఫా గా జిల్లాలో 1,21,955 మంది రైతులకు రూ.6707.525 లక్షలు మేర ప్రయోజనం రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం లో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రారంభిస్తారని ఆమె తెలిపారు.
డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా లాంచింగ్ జిల్లా స్థాయిలో కార్యక్రమం అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు, అధికారులు ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు హాజరవుతారని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తెలిపారు.
జిల్లాలోని 19 మండలాల పరిధిలో లబ్ధి పొందిన రైతులు, ఆర్థిక వివరాలు:
అనపర్తిలో 3975 మందికి రూ 218.63 లక్షలు,
బిక్కవోలు 6403 మందికి రూ 352. 17 లక్షలు,
రంగంపేట 8226 మందికి రూ.452.43 లక్షలు ;
గోపాలపురం 7832 మందికి రూ.430.76 లక్షలు;
దేవరపల్లి 7096 మందికి రూ .390.28 లక్షలు ;
నల్లజర్ల 9327 మందికి రూ.512.985 లక్షలు ;
గోకవరం 8350 మందికి రూ.459.25 ;
కొవ్వూరు 5588 మందికి రూ.307.34 లక్షలు ;
చాగల్లు 5461 రూ.300.355 లక్షలు ;
తాళ్లరేవు 4935 మందికి రూ.271.425 లక్షలు ;
నిడదవోలు 8249 మందికి రూ.435.695 ;
ఉండ్రాజవరం 5190 మందికి రూ.285.45 లక్షలు,
పెరవలి 6817 మందికి రూ.375.045 లక్షలు;
రాజమహేంద్రవరం రూరల్ 1864 మందికి రూ.102.52 లక్షలు ;
కడియం 4988 మందికి రూ.274.34 లక్షలు;
కోరుకొండ 9811 మందికి రూ.539.603 లక్షలు ;
రాజానగరం 10327 మందికి 567.985 లక్షలు ;
సీతానగరం 7514 మందికి రూ.413.27 లక్షలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని తెలిపారు.