Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కనీస వేతనం లేదమ్మా ఉద్యోగ భద్రత కల్పిస్తారా తల్లి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– స్పందన లో విన్నవించుకున్నా జీజీహెచ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో గత 20 సంవత్సరాలు గా అవుట్ సోర్సింగ్ పద్దతి లో సేవలు అందిస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందనలో తమ గోడును విన్నవించారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు పరిష్కారం కోరుతూ జాయింట్ కలెక్టర్ ఇలాకియా కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎన్. సత్తిబాబు, మేరీ, రేవతి లు మాట్లాడుతూ గత చాలా కాలంగా జిజిహెచ్ లో కేవలం 4030/-రూ. నుండి 6110/-రూ. మాత్రమే జీతం తీసుకుంటూ సేవలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను బయట ఉద్యోగాలు చూసుకోవాలని అధికారులు చెప్పడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. కోవిడ్ సమయం లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి, తక్కువ జీతమైనా, అదీ కూడా సకాలంలో రాకపోయినా సేవలు చేసామన్నారు. తాము పర్మినెంట్ చేయమని అడగడం లేదని, కేవలం జిఓ ప్రకారం కనీస వేతనాలు ఇచ్చి, కొనసాగిస్తే చాలన్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ ఇలాకియా స్పందిస్తూ, అక్కడే ఉన్న ఆర్.ఎం.ఓ. తో మాట్లాడారు. ఫోన్ లో సూపరింటెండెంట్ ను సంప్రదించారు. మరోసారి మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పి.ఎస్.రాయుడు, లలిత కుమారి, రమణ, సత్యవాణి, చిట్టితల్లి, సుధాకర్, శ్రీను, బేబిరాణి, చంద్రకళ, పెద్దిరాజు, నాగభూషణం లతో పాటు సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement