విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
మండపేట పట్టణం (విశ్వం వాయిస్) లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంనకు విశేష స్పందన లభించింది. మండపేట పట్టణం మూడవ వార్డులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైసీపీ శ్రేణులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వాలెంటీర్లు,సచివాలయం సిబ్బంది వెంటరాగా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏమయినా లోటు పాట్లు వుంటే ప్రక్కనే వున్న వాలంటీర్ల కు, సచివాలయం సిబ్బంది కి తెలిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తోట అదేసి స్తున్నారు. ఇదే వార్డు లో ఒక ఆసామి ఇండ్ల స్థలం ఇప్పించమని తోట త్రిమూర్తులుని అడిగితే ఆయన వెంటనే స్పందించి టిడ్కో ఇళ్లు మంజూరు చేయించారు. తోట వెంట వైసీపీ నాయకులు వేగుళ్ళ పట్టాభిరమయ్య, రెడ్డి రాధ కృష్ణ, కర్రి పాపారాయుడు, యువ నాయకులు తోట పృధ్వీ రాజ్, సిరివరపు శ్రీని వాసు, పిల్లి గణేష్, చిట్టూరి సతీష్, కాల్లకూరి నాగబాబు, గ్రంది శ్రీను, శెట్టి కళ్యాణి, కొమ్ము రాం బాబు, సనక్కాయల దొరబాబు, మండపేట ఎంపీపీ ఉండమట్ల వాసు,కపిలేశ్వరపురం మండలం ఎంపీపీ మేడిశెట్టి సత్యవేని దుర్గారావు, జెడ్పీటీసీ అబ్బు, పి. మధు, యర్రంశెట్టి నాగేశ్వర రావు, పోలిశెట్టి గణేష్, నక్క సింహాచలం, సలాది వీర బాబు, వంగా నల్ల శ్రీను, పాలంగి కిషోర్, అధిక సంఖ్యలో మహిళలు, వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.