సబ్సిడీపై అందుచేత
జిల్లా కలెక్టర్ కే. మాధవిలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ కొనుగోలు కేంద్రాలలో(పిఎసిఎస్) మౌలిక సదుపాయాల కల్పనకు 90% నిధులను ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం సహకార శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 29 పి ఎ సి ఎస్ కేంద్రాలకు 66 కంప్యూటర్లను సమకూర్చడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో అందిస్తున్న దృష్ట్యా ఆయా సొసైటీ లు వారి వాటాగా 10 శాతం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా 7 ప్రాథమిక సహకార కేంద్రాలకు లక్ష ఇరవై వేల రూపాయలతో మయశ్చర్ పరికరాలు అంద చేస్తున్నట్లు తెలిపారు. పి ఎ సి కేంద్రాలలో డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉంచేందుకు 90 శాతం సబ్సిడీతో అందజేస్తామని, ఇందులో భాగంగా 10 శాతం వాటా ఆయా సొసైటీ లు చెల్లింపు చెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరో ఏడు పిఏసిఎస్ కేంద్రాలకు 9 తూనికలు పరికరాలు సరఫరా చేయడం జరిగిందన్నారు. రాజమండ్రీ డివిజన్ లో 29 కేంద్రాలకు సుమారు రూ.12 లక్షల ను వెచ్చించి 60 డిజిటల్ తేమ శాతం పరిశీలన యంత్రాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. తెలికిచేర్ల, పల్లంట్ల, రంగంపేట, కాపవరం లోని ప్యాక్ సొసైటీ ఆధ్వర్యంలో నాలుగు ఆర్ బి కె లు నిర్మించడానికి రు. కోటి ఆరవై లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందచేసే ఈ నిధుల వినియోగం పై కో ఆపరేటవ్ సహకార సంస్థ ఆధ్వర్యంలో పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నిధులు సక్రమ వినియోగం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ
సమావేశంలో డిసిఓ తూర్పు గోదావరి) ఎంవివి నాగభూషణం, డిసిసిబి సిఈఓ (ఏలూరు) శ్రీమతి శ్రీ దేవి, డీఈఈ (అగ్రి) మార్కెటింగ్ సూర్య ప్రకాశ్ రెడ్డి , డీఈ అగ్రి మార్కెటింగ్ ఏలూరు) మల్లేశ్వరరావు, డిసీసీబీ సీఈవో కాకినాడ) నరసింహారావు, డీఈఈ అగ్రి మార్కెటింగ్ (కాకినాడ) వెంకటేశ్వరరావు, ఏలూరు,కాకినాడ డిపిఎండిలు కొండలరావు,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.